ప్రపంచాన్ని ఇప్పుడు గడ గడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తున్నారు.  ఇప్పటికే లాక్ డౌన్ చేస్తూ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు.  ఇతర దేశాలతో పోల్చితే కరోనా ప్రభావం భారత్ లో తక్కువ ఉందని అన్ని దేశాల వారు మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యతిరేకంగా జ‌రుగుతున్న పోరాటం మన జీవిత కాలంలో చేస్తున్న‌ అతిపెద్ద అదృశ్య యుద్ధమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

 

ఈ సంక్షోభానికి వ్యతిరేకంగా భారత్ యుద్ధ ప్రాతిపదికన పోరాడుతోందని, అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి కట్టుగా ప‌నిచేస్తున్నాయ‌ని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఢిఫెన్స్ కంపెనీలు ఎన్ - 95 మాస్కులు, పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్‌ను తయారు చేస్తున్నాయని, త్రివిధ దళాలూ ప్రభుత్వ ఆదేశానుసారం పనిచేస్తున్నాయ‌ని ఆయ‌న‌ తెలిపారు.

 

రక్షణ దళాలకు కరోనా సోకకుండా చర్యలు తీసుకుంటూనే ఉన్నామని ఆయన తెలిపారు.నేవీ, ఏయిర్‌ఫోర్స్, ప‌దాతి దళాల్లో అన్ని చర్యలూ తీసుకుంటూనే ఉన్నామని రాజ్‌నాథ్ ప్రకటించారు.  లాక్ డౌన్ వచ్చే నెల 3 వరకు పొడిగించారు.. ఎవరూ ఉల్లంఘన చేయకండి అని హితవు పలికారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: