ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి రోజులు దగ్గరపడ్డాయి. రోజూ ప్రపంచ వ్యాప్తంగా వేల మందిని కరోనా పొట్టన పెట్టుకుంటోంది. ఇప్పటి వరకూ లక్షన్నర మంది పైగా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీనికి మందు లేకపోవడం ఓ విషాదం అయితే.. ఈ రోగం 14 రోజుల తర్వాతే బయటపడే అవకాశం ఉండటం మానవులకు శాపంగా మారింది.

 

 

కరోనా విపరీతంగా స్ప్రెడ్ కావడానికి ఇదో కారణం. అలాంటి కరోనా మహమ్మారికి మొట్టమొదటసారిగా అమెరికా మందు కనిపెట్టింది. ఇప్పటి వరకూ వేరే రోగాలకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విల్ వంటి మందులనే కరోనాకు వాడుతున్నారు తప్ప.. కరోనా కోసం ఎలాంటి మందులూ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ఆ లోటు తీరుతోంది.

కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన రోగులకు అత్యవసర మెడిసన్‌గా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను వాడొచ్చునని అమెరికా ప్రకటించింది.

 

 

అమెరికా ప్రభుత్వం ఈ కొత్త డ్రగ్ కు అనుమతి ఇచ్చింది. తెలిపింది. ఇక కరోనా వైరస్ వచ్చాక, చికిత్సకు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుకొని బయటికొచ్చిన తొలి మెడిసిన్‌ ఇదే. మరి కరోనా వైరస్ సోకినవారికి అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త ఔషధం పనిచేస్తే ఇక కరోనా కు రోజులు దగ్గరపడ్డట్టే. ఈ మందు రూపకల్పన పట్ల ట్రంప్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

 

 

ఈ కొత్త మందు కారణంగా బాధితులు 31 శాతం త్వరగా కోలుకుంటారట. ఈ మేరకు అమెరికాలోని అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్చువస్‌ డిసీజెస్‌ ఓ నివేదిక ఇచ్చింది. ఈ కొత్త మందు ఎలా పనిచేస్తుందంటే.. ఇది వైరస్ యొక్క జన్యువులో కలిసిపోయి, దాని తీవ్రతను తగ్గించేస్తుంది. అయితే ఈ మందు ఇప్పుడే వచ్చినందు వల్ల మరికొంత స్పష్టత రావాల్సిన అవసరం మాత్రం కనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: