లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యం లో ప్రజలను కాపాడే ప్రయత్నం లో పోలీసులు నిరంతరం కష్ట పడుతూనే ఉన్నారు.. అయితే ప్రజలు బయటకు రావాలని ఆలోచనతో.. బయట విచ్చల విడిగా తిరుగుతున్నారు.. పోలీసుల కళ్లు కప్పి మరి బయట తిరుగుతున్నారు.. మరికొందరు మాత్రం అడ్డొచ్చిన పోలీసులకు చితకబాది మారి పారిపోతున్నారు..


 

 

ఇంక మహారాష్ట్రలో అయితే  ఏ ఎస్సై చెయ్యి నరికేసిన ఘటన భారత దేశాన్ని కదిలించి వేసిన సంగతి తెలిసిందే.. ఆ విషయం పూర్తిగా మరువక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది.. అదేంటంటే ఇంచుమించు అలాంటి ఘటనే విజయవాడలో జరిగింది. ఆయుధాలు లేకపోయినా పళ్లతోనే పోలీస్‌పై దాడి చేశాడో యువకుడు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌‌ని తీవ్రంగా గాయపరచిన దారుణ ఘటన విజయవాడలో వెలుగుచూసింది.


 

 

రాణిగారితోట పరిధిలోని అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ ఇంటి పనులు చేస్తుంటుంది. ఆమె రెడ్‌జోన్ పరిధిలోని ఏరియా నుంచి వస్తోందని కంట్రోల్ రూమ్‌కి సమాచారం రావడంతో రెడ్‌జోన్‌లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆంజనేయులుని అప్రమత్తం చేశారు. ఆ మహిళ వివరాలు సేకరించాల్సిందిగా కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు రావడంతో ఆయన అపార్ట్‌మెంట్‌కి వెళ్లారు.



 

 

మహిళ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.. అలాంటి సమయంలో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ సైదా అలీమ్ అనుచితంగా ప్రవర్తించాడు. అసలు అపార్ట్‌మెంట్‌కి ఎందుకొచ్చావంటూ గొడవకు దిగి కానిస్టేబుల్ వేలు కొరికేశాడు. దీంతో కానిస్టేబుల్ చేతివేలికి గాయమైంది. ఈ ఘటనపై కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు అలీమ్‌ని అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: