ఈమధ్య కాలంలో సినిమాలకంటే వెబ్ సిరీస్ లే ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. వెబ్ సిరీస్ ల హావా ప్రస్తుతం ఎక్కువగా నడుస్తోంది. అటు సినిమాల్లో ఎంతో పాపులర్ అయిన నటులు కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అంటారా... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది మని హెస్ట్ అని చెప్పాలి. ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యే వెబ్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. అయితే మొదట స్పెయిన్లో దీనిని స్ట్రీమింగ్ చేసినప్పటికీ అక్కడ ఇది పూర్తిగా ఫ్లాప్ అయ్యింది. కానీ ఆ తర్వాత మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ గా రికార్డులకెక్కింది ఈ వెబ్ సిరీస్.
ప్రత్యేకించి ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా... ఈ వెబ్ సిరీస్ విషయంలో తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తావన వచ్చింది కాబట్టి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని ఈ వెబ్ సిరీస్ లో ఓ పాత్ర కోసం సలెక్ట్ చేస్తాను అంటూ దర్శకుడు అంటున్నాడు. ఇంతకీ ఎందుకు అలా అన్నాడు అంటారా... ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ మెయిన్ రోల్ లో కనిపించే ప్రొఫెసర్ తన గ్యాంగ్ చేసే దొంగతనాలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. అయితే ఈ పాపులర్ వెబ్ సీరియస్ డైరెక్టర్ ఒకవేళ ఇండియా వర్షన్ అయితే తన క్యాస్టింగ్ ఎలా ఉంటుందో తాజాగా ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు.
ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ అయిన అలెక్స్ రోడ్రిగో ఇండియన్ వర్షన్ తెరకెక్కించాల్సి వస్తే ఆయా పాత్రల కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాను అని కొంతమంది పేర్లు చెప్పుకొచ్చాడు. మొదట ప్రొఫెసర్ పాత్రకు అయితే ఇళయదళపతి విజయ్ సేతుపతిని తీసుకుంటా అని చెప్పిన డైరెక్టర్... బోగొట్టా పాత్రకు తమిళ హీరో అజిత్ ను తీసుకుంటాం అని చెప్పాడు. ఇలా మరి కొన్ని పాత్రల కోసం బాలీవుడ్ హీరోల పేర్లు చెప్పారు. టాలీవుడ్ నుంచి ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మాత్రమే చెప్పాడు ఆ డైరెక్టర్. టోమయో పాత్ర కోసం మహేష్ బాబు ను సెలెక్ట్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.