ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖకు మాత్రం కొన్ని ప్రత్యేకలున్నాయి. సముద్రం, స్టీల్ ప్లాంట్ తో పాటు ఇతర జిల్లాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన జిల్లా కావడం... ఇతర రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా నివశించే జిల్లా కావడం విశాఖ ప్రత్యేకత. మెట్రో నగరాల సరసన చేరగలిగినటువంటి అవకాశం ఉన్న ఏకైక జిల్లా విశాఖ. నావీ కూడా విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ జిల్లాలో ఎవరి పని వారిదే అనే రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు. 
 
అయితే ప్రశాంతంగా ఉన్న విశాఖ జిల్లా గురించి ఎల్జీ పాలిమర్స్ వల్ల ఇతర రాష్ట్రాల ప్రజలకు తెలిసింది. ఎల్జీ పాలిమర్స్ కు సరైన అనుమతులు లేవని... ఎలాంటి అనుమతులు లేకుండానే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తేలింది. గ్యాస్ లీకేజీ వల్ల విశాఖ ప్రజలు భయాందోళనకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికీ అక్కడి ప్రజలు స్వల్ప అస్వస్థతలకు గురవుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. 
 
ఏదైనా ఘటన జరిగితే అధికారులు కొంతకాలం హడావిడి చేసినా తర్వాత సాధారణ పరిస్థితి నెలకొంటుంది. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక పార్టీపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఆ గ్యాస్ ప్రభావం వారిపై ఎన్ని రోజులు ఉంటుందో..? ఎవరూ చెప్పలేరు. భవిష్యత్తులో వారు ఇతర సమస్యల భారీన పడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. 
 
ఇది విశాఖలోని అధికారులు, ఇతర రాష్ట్రాలు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నేర్చుకోవాల్సిన పాఠం. రెండోది హనీట్రాప్. అమ్మాయిల ద్వారా సైనికులను, నావీను లోబరచుకుంటూ రక్షణకు సంబంధించిన సమాచారం చేరవేస్తున్నారు. అందువల్ల తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని అనుకోవటం తప్పు. పొరపాటున అవతలి వ్యక్తుల మాయమాటలు నమ్మితే మాత్రం మోసపోవడం ఖాయం. ఇది విశాఖ నుంచి భారత్ నేర్చుకోవాల్సిన మరో పాఠం. 

మరింత సమాచారం తెలుసుకోండి: