కరోనా మన దేశంలోకి వచ్చినప్పటి నుండి ప్రస్తుత పరిస్దితులను గమనిస్తే అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేసే వారి జీతాల్లో కోతలు పడ్డాయి.. మరి వచ్చే జీతాలకు తగ్గట్టుగా జీవితాలు నడుస్తున్నాయా అంటే అదీ లేదు.. ఒక వైపు పెట్రోల్, కరెంట్ బిల్లు, సెల్ బిల్లు, నిత్యావసర సరకులు ఇలా ఒకటని ఏది లేదు అన్నీ చిరుతలా పరుగులు పెడుతున్నాయి కానీ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు తప్పా..

 

 

ఇలాంటి పరిస్దితుల్లో సామాన్యుడు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్దితుల్లో బిక్కుబిక్కు మంటు బ్రతుకుతున్నాడు. కరోనా వైరస్ విసృతంగా వ్యాపిస్తున్న తరుణంలో కనీసం తన ఆరోగ్యానికి కూడా డబ్బులు వెచ్చించలేని దౌర్భాగ్యపరిస్దితులు నెలకొన్నాయి. ఇక పిల్లల చదువులైతే ఆగమ్యగోచరంగా మారాయి. ముఖ్యంగా చిన్న జీతాలకు పనిచేసే ఉద్యోగుల బ్రతుకులు చీకట్లో కలిసి పోతున్నాయి..

 

 

ఇకపోతే మన రాష్ట్రంలో కరోనా వల్ల అన్ని సంస్దలు స్దంభించి పోయాయి.. అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు మార్చి 21 నుంచి ఆగిపోయాయి. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మే 19 నుంచి తిరిగి కేవలం జిల్లా సర్వీసులు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇక కరోనా వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు మూడు నెలలుగా 50 శాతం వేతనాలే ఇస్తున్నారు.. కాగా జూన్ ‌నెలకు పూర్తి జీతం వస్తుందని ఆశపడుతున్న ఆర్టీసీ సిబ్బందిపై మరోసారి కోతల పిడుగు పడింది.. ఈ సారి మామూలు కోతలు కాదు.. కొన్ని డిపోల్లో అయితే అడ్డగోలు కోతలు కోశారట..

 

 

ఆ వివరాలు చూస్తే సంగారెడ్డి డిపోకు చెందిన ఒక డ్రైవర్‌ మూలవేతనం రూ.15,010. ఉండగా మామూలుగా ఆయనకు నెలకు రూ.20 వేల దాకా జీతం వస్తుంది. కానీ, జూన్‌ నెలకుగాను వచ్చిన జీతం.. అక్షరాలా 49 రూపాయలట.. అదే డిపోకు చెందిన మరో డ్రైవర్‌కు వచ్చిన వేతనం.. రూ.60. ఇంకో డ్రైవర్‌కు రూ.1600 వచ్చింది! ఇలా ఆ డిపోలో 20 మందికి రూ.100 లోపు.. 50 మందికి రూ.1000లోపు వేతనాలు వచ్చాయట..

 

 

ఇక భద్రాచలం డిపోలో 483 మంది ఉద్యోగుల్లో 400 మందికి ఇదే దయనీయ స్థితిలో ఉన్నారట.. అంతే కాకుండా మేడ్చల్‌, మెహదీపట్నం డిపోల్లో పనిచేస్తున్న సిబ్బందిదీ కూడా ఇదే వ్యధ. వీరి కష్టాలకు మూలం అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు ఉద్యోగులు. ఈ విషయంలో డిపో మేనేజర్ల స్పందన కోరగా.. విధులు లేనప్పుడు వేతనాలు ఇవ్వడం ఎలా కుదురుతుందని, అంతే కాకుండా తమకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా దాదాపుగా ప్రజల జీవితాలు కరోనా వల్ల చిన్నాభిన్నం అయ్యాయన్నది నిజం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: