స్విస్ బ్యాంక్ లో వందల కోట్లు దాచుకున్న 80 ఏళ్ల బామ్మను ఇన్ కంట్యాక్స్ అపిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) షాక్ ఇచ్చింది. ప్రభుత్వ లెక్కల్లో చూపని రూ.196 కోట్లకు పన్ను, జరిమానా చెల్లించాలని  ఐటీఏటీ ముంబయి బెంచ్ ఆదేశించింది. పన్నులు చెల్లించాలని తీర్పు వెలువడటంతో 80 ఏళ్ల రేణు తరణి ఒక్కసారిగా అవాక్కైంది.

 

 

అయితే కేమన్ దీవుల్లోని జీడబ్ల్యూయూ ఇన్వెస్ట్ మెంట్స్ పేరుతో హెచ్ ఎస్ బీసీ జెనీవాలో ఆమె బ్యాంకు ఖాతా ఉంది. ఈ ఖాతా నుంచి రేణు తరణి కుటుంబానికి చెందిన ట్రస్టుకు నిధులు వచ్చాయని ఐటీఏటీ నిర్ధారించింది. 2004 లో ఈ బ్యాంక్ లో ఖాతా తెరిచినట్లు అధికారులు తెలియజేశారు. దీనికి లబ్ధిదారు కేవలం రేణు తరణి మాత్రమేనని వారు పేర్కొన్నారు.

 

IHG

 

తాజగా ఐటీ రిటర్నులకు సంబంధించి రేణు తరణి 2005 నుంచి 2006లో ఈ స్విస్ బ్యాంక్ ఖాతా గురించి వెల్లడించలేదని ఐటీ శాఖ పేర్కొంది. ఈ స్విస్ అకౌంట్ లో రూ.196 కోట్లు ఉన్నాయని, ఆ డబ్బుకు సంబంధించిన వివరాలు, పన్నులు చెల్లించలేదని తెలిపారు. 

 


కాగా, రేణు తరణి హెచ్ ఎస్ బీసీ జెనీవాలో తనకు ఎలాంటి బ్యాంకు ఖాతా లేదని అఫడవిట్ లో పేర్కొంది. తనకు ఆ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని, జీడబ్ల్యూయూ ఇన్వెస్ట్ మెంట్స్ లో తనకు వాట లేదని. ఆ సంస్థకు డైరెక్టర్ ని కాదని ఆమె స్పష్టం చేశారు. 2005-06కు సంబంధించిన ఐటీ రిటర్నులో తాను బెంగళూరు నివాసితురాలని, అప్పడు తన ఆదాయం 1.7 లక్షలని తను దాఖలు చేసిన పిటిషన్ లో వెల్లడించారు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: