ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ విలయతాండవం చేస్తోంది. చైనా దేశంలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి కరోనా  వైరస్ ఏ దేశాన్ని వదిలి పెట్టడం లేదు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలను కదిలిస్తుంది ఈ కరోనా  వైరస్. రోజురోజుకు భారీగా కేసులు పెరిగిపోతుండటం మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్న తరుణంలో.. ప్రపంచ ప్రజానీకం మొత్తం కరోనా వ్యాక్సిన్ గురించి ఎంతో నిరీక్షణగా  ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే, ప్రస్తుతం కరోనా  వ్యాక్సిన్ కు సంబంధించి అన్ని దేశాల్లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్   చివరి దశలో ఉన్నాయి. భారతదేశంలో కూడా మూడు కరోనా వ్యాక్సిన్ లు తయారు అవుతున్న విషయం తెలిసిందే,



అయితే గత కొన్ని రోజుల నుంచి కరోనా  వైరస్ కు అసలుసిసలైన వ్యాక్సిన్ తమదేనంటూ అమెరికాకు చెందిన మెడెర్నా  కంపెనీ చెప్పుకుంటుంది. అంతేకాదు ఈ వ్యాక్సిన్ ధర మూడు వేల నుంచి 5 వేల మధ్యలో ఉండబోతుంది అన్న విషయాన్ని వెల్లడించింది ఆ కంపెనీ. అయితే రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్  ధర మరింత తగ్గే అవకాశం కూడా లేకపోలేదు అని ప్రస్తుతం టాక్  వినిపిస్తుంది. ఎందుకంటే  ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్  యూనివర్సిటీ తమ వాక్సిన్ ధర  కేవలం 300 రూపాయలు మాత్రమే నిర్ణయించింది. 300 రూపాయలకు అమెరికాకు 30 కోట్ల డోసులను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ఆక్స్ ఫర్డ్  యూనివర్సిటీ.


 ఈ వ్యాక్సిన్  పై ప్రజల్లో కూడా మంచి నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్  యూనివర్సిటీ కరోనా  వైరస్ వ్యాక్సిన్ కు అతి తక్కువ ధర నిర్ణయించిన నేపథ్యంలో మెడెర్నా కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్  ధర విషయంలో ప్రస్తుతం ఆ కంపెనీ ప్రతినిధులు కాస్త అయోమయంలో ఉన్నారట. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకటించిన విధంగా మూడు వేల నుంచి 5 వేల లోపు వ్యాక్సిన్ ద్వారా అని అంచనా వేసినప్పటికీ... అదే ఫైనల్ కాదని... అన్ని వ్యాక్సిన్ల  ధరలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తమ వాక్సిన్ ధరను నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి అంటూ మెడెర్నా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరి తమదే  శక్తివంతమైన వ్యాక్సిన్ అని చెప్పుకుంటున్న మెడెర్నా వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుంది అన్న దానిపై  అటు ప్రజల్లో కూడా అయోమయం నెలకొంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: