వివరాల్లోకి వెళితే... కడప జిల్లాకు చెందిన మల్లయ్య గారి వెంకటేశ్వర్లు ఉపాధి నిమిత్తం మార్కాపురానికి వచ్చి ఇక్కడే నివసిస్తున్నాడు. గుంటూరు జిల్లా కొచ్చెర్ల కు చెందిన అశ్విని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చికెన్ దుకాణం లో పనిచేస్తూ వెంకటేశ్వర్లు కుటుంబపోషణ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నీచంగా ఆలోచించింది భార్య. అదే ప్రాంతానికి చెందిన దేవరాజు అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడగా అతనితో వివాహేతర సంబంధానికి తెరలేపింది.
ఇక రోజు రోజుకి వీరి రాసలీలలు శృతి మించుతూ వచ్చాయి. ఇక ఇటీవల దేవరాజ్ భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లగా.. వీరి రాసలీలలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక ఈ విషయం ఓ రోజు భర్త వెంకటేశ్వర్లుకు తెలిసింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో కట్టుకున్న బంధం కంటే కామ సుఖం తీర్చే బంధమే ఎక్కువ అనుకున్న అశ్విని ఏకంగా భర్తనే చంపేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి... పథకం ప్రకారం భర్త కళ్లలో కారం కొట్టి ఇనుపరాడ్డు తో తలపై కొట్టి దారుణంగా చంపేశారు. ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఇక మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి