తెలంగాణ రాష్ట్రానికి చెందిన కె కేశవరావు అలియాస్ కేకే
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు. సైబర్ క్రైమ్ కేటుగాళ్ళు ఇటీవల కేకే ను ట్రాప్ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ నాయకుడు కావడం వలన చివరి క్షణంలో వారిపై సందేహంతో ఐటీ శాఖ
మంత్రి అయిన
కేటీఆర్ ను సంప్రదించి తనను మోసం చేయబోతున్నారు అన్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన
మంత్రి కేటీఆర్ పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసి వారిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సంచలనంగా మారిన ఈ ఉదంతం తరహాలోనే ఏపీలో కూడా ఒక మహిళా ఎమ్మెల్యేకు ఈ తరహా సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేయబోయి నట్లు తెలిసింది.
ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించు కుంటున్న కొంతమంది తెలివి లేని వాళ్ళు మరియు సైబర్ నేరగాళ్లు ఎంతోమంది సామాన్యులను వాళ్ళ చావు తెలివితేటలతో ఈజీగా మోసం చేస్తున్నారు.
ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సంఘంలో ప్రముఖులను తమ టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా
ఏపీ లోని అనంతపురం
జిల్లా కళ్యాణదుర్గం
ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ ను అలాగే చేయడానికి ప్రయత్నించినట్లుగా తెలిసింది.
ఉష శ్రీ చరణ్ చెప్పిన విధంగా ఒక
ఫోన్ కాల్ వచ్చిందని అందులో ఆగంతకుడు మాట్లాడుతూ నేను
కేంద్ర ప్రభుత్వ అధికారినని పిఎంఈజిపి కింద భారీ ఎత్తున రుణం ఇప్పిస్తానని నమ్మబలికాడు.
ఈ పథకం కింద మూడు కోట్ల రూపాయల మేర రుణం తీసుకోవచ్చు 50 శాతం సబ్సిడీ కూడా వస్తుందని దీనికి చివరిరోజు ఈరోజే అని ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చి ఎమ్మెల్యేను బాగా పూరించాడు. ఇదంతా విన్న తర్వాత చివర్లో మీరు ఈ పథకాన్ని పొందాలంటే మూడు లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. తనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి
ఫోన్ చేసి ఇలా చెబుతున్నాడు. అది కూడా మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పడంతో ఆమె అనుమానించింది. వెంటనే పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. తనకు జరిగిన కథ వాళ్లకి తెలియజేశారు. అదంతా మోసం అనే విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే కళ్యాణదుర్గం పోలీసులకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేలను కూడా వదిలిపెట్టని ఈ సైబర్ నేరగాళ్లను పట్టుకోడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ
ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది? మిగతా వివరాలను సేకరించే పనిలో పడ్డారు. మొన్ననే
తెలంగాణ రాజ్యసభ సభ్యుడు కూడా ఇదేవిధంగా మోసపోవడం తెలిసిందే. దయచేసి ప్రతి ఒక్కరూ అనుమానిత కాల్స్ ను రిసీవ్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి.