బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు అందుకున్నాడో లేదో ఇలా వెంటనే తన బిజెపి రాజకీయజోరును పెంచాడు.ఆ పార్టీకి కొత్త హంగులు తెస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నాడు. రావడమే తడవుగా టిఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేశారు సంజయ్.......ప్రస్తుతం రాజకీయాల్లో నువ్వా.?...నేనా...?.. అన్న పోరు ఈ ఇరుపార్టీల మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే... అలా వీరి మధ్య చెలరేగుతున్న మాటల తుఫాను ఇప్పుడు పెను ఉప్పెనలా మారింది. టిఆర్ఎస్ అధినేత,తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్.... అధికారంలోకి వచ్చిన మీరు రైతులకు ఏం మేలు చేశారంటూ నిలదీశాడు..!! రాష్ట్రానికి మీరిచ్చిన మాటేమిటి చేస్తున్న పని ఏమిటి...?.. అంటూ మాటల బాణాలు విసిరాడు. నాటకాలలో అద్భుతంగా నటించడం మాత్రమే కాదు జీవించే వ్యక్తి మన రాష్ట్ర సీఎం అంటూ చురకలు వేశాడు.


అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పే అబద్ధాలు వింటుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది అన్నారు.. మోడీ గారు దేశంలోని ప్రతి గ్రామం వెలుగులతో నిండి పోవాలని ఆశిస్తుంటే మరి తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ ఇప్పటివరకు ఈ విషయంలో ఏమి చేసాడో చెప్పాలంటూ నిలదీశాడు. లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్... ఒక ఉద్యోగం ఇవ్వలేదు... దానికి ఏం సంజాయిషీ చెప్తారో చూడాలన్నారు. విద్యుత్ సవరణ చట్టంతో ఉద్యోగాలు పోతాయన్న కేసీఆర్ మాటలు.... వట్టి అబద్ధాలే అంటూ కొట్టిపారేశారు. దేశం కోసం శ్రమించే రైతులకు ఉచిత విద్యుత్ ను ఇస్తాడో లేదో కేసీఆర్ స్పష్టం చేయాలని కోరాడు. 


ముందు జీఎస్టీ వద్దంటూ మొరాయించిన కేసీఆర్.... తర్వాత ఢిల్లీకి వెళ్లి మరి మోడీ కాళ్లు పట్టుకున్నాడు అన్నాడు. దాదాపు 15 వేల కోట్ల రూపాయల డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది అని చెప్పుకొచ్చారు.... ప్రజలకు చేరాల్సిన సొమ్మును.... అక్రమంగా వేల కోట్ల రూపాయలను కేసీఆర్ సంపాదిస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.. ఇక కేసీఆర్ అరాచకాలను రాష్ట్ర ప్రజలు భరించే స్థితిలో లేరని స్పష్టం చేశారు. అంతేకాదు ఏపీలో లేని విద్యుత్ సమస్య మరి తెలంగాణలో మాత్రం ఎందుకు వస్తుంది అంటూ ప్రశ్నల తుఫాను కురిపిస్తూ ఆరోపణలు చేశారు బండి సంజయ్...


మరింత సమాచారం తెలుసుకోండి: