ఈ మధ్యకాలంలో వావివరుసలు మరచి పోతున్న కామందులు ఏకంగా సొంత వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్న ఘటనలు రోజురోజుకీ తెరమీదికి వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై.. అమ్మలా చూసుకోవాల్సిన వదిన పై కామ కోరికలతో ఊగిపోయి  చివరికి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వావివరుసలు మరిచిన కామాంధుడు ఏకంగా కొడుకు భార్యపై  కన్నేశాడు. చివరికి ఓ రోజు అతని చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక దీనిని సాకుగా చూపుతూ పలుమార్లు సదరు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు సదరు వ్యక్తి. రోజుకు అతని వేధింపులు ఎక్కువ అవుతుండడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.




 సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. బీహార్లోని లఖీ సరాయ్ గ్రామంలో చున్నీ లాల్  అనే వ్యక్తి తన కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. స్వీట్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతని భార్య 10 సంవత్సరాల క్రితమే మరణించగా ప్రస్తుతం ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నాడు. ఇక చిన్న కుమారుడు కోల్కతాలో ఉద్యోగం చేస్తుండగా పెద్ద కుమారుడు ఇటీవలే వివాహం చేసుకొని స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఇక వ్యాపార నిమిత్తం తరచూ వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉండే వాడు పెద్ద కుమారుడు.




 ఈ క్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కోడలి పై కన్నేశాడు మామ. కూతురులా  చూసుకోవాల్సిన కోడలిపై కామ కోరికలతో రగిలి పోయే వాడు. ఈ క్రమంలోనే సరైన అదును కోసం చూసిన మామ ఏకంగా కోడలు బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో... అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించాడు. అనంతరం కోడలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తన కొడుకు చెబితే ప్రాణాలు  తీస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే తర్వాత కూడా పలుమార్లు సదరు యువతి పై అత్యాచారానికి ఒడిగట్టాడు. రోజురోజుకు మామ కీచక చర్యలు పెరిగిపోతుండడంతో తట్టుకోలేక బాధిత యువతి.. తన కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని  నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: