ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి అనే విషయం తెలిసిందే. పరాయి  వ్యక్తుల మోజులో పడి కట్టుకున్న  బంధాన్ని మరిచి దారుణం గా వ్యవహరిస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు అయితే ఏకంగా కన్న పేగు బంధాన్ని కూడా మరిచి  క్షణకాల సుఖమే ముఖ్యం అనుకుని దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చెబుతున్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. క్షణకాల సుఖం కోసం అమ్మతనానికి మచ్చ తెచ్చింది ఇక్కడ కసాయి తల్లి.



 ఏకంగా ప్రియుడి మోజులో పడి తన  సుఖానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకు ని కిరాతకంగా హత్య చేసింది. ఘటన కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది. చిన్నారి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన ఉషా రెండు నెలల కిందట భర్త నుంచి విడిపోయి ప్రియుడు శ్రీనుతో కలిసి ఉంటుంది. ఉషా కి కొడుకు ఉన్నాడు.



 భర్తతో విడిపోయినప్పటికీ కొడుకును తనతోనే ఉంచుకుంది ఉష. కానీ కొన్నాళ్ళకి పేగు తెంచుకుని పుట్టిన బంధమే భారంగా భావించింది సదరు మహిళ. దీంతో ప్రియుడితో తన సుఖానికి చిన్నారి కొడుకు అడ్డు వస్తున్నాడని భావించిన ఆ కసాయి తల్లి ఏకంగా దారుణంగా చిన్నారి అంతమొందించింది. ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం చిన్నారి కొడుకుని చంపేసి అనంతరం... తెలంగాణ రాష్ట్రంలో కోదాడ వద్ద గొయ్యి తీసి చిన్నారి మృతదేహాన్ని పూడ్చి పెట్టింది. చిన్నారి కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించి గా రంగంలోకి దిగిన పోలీసులు ఉషాను  అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: