ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోతారు అని గత కొంత కాలంగా మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే ఎవరూ కూడా ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని ప్రచారం కూడా కాస్త ఎక్కువగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు బయటకు వెళ్లి పోయే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చలు బాగా జరుగుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే ఒకమంత్రితో చర్చలు జరుపుతున్నట్టు గా తెలుస్తుంది.

విశాఖ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేతతో వారు చర్చిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే త్వరలోనే ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా వైసిపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. వీరిద్దరూ కూడా పదవులకు రాజీనామా చేసే వెళ్లడానికి రెడీ అవుతున్నారట. అయితే మీడియాలో మాత్రం వార్తలు రాలేదు. అయితే వారిద్దరూ రావడానికి సీఎం జగన్ అంగీకారం తెలిపిన సరే...

కొంతమంది వైసీపీ నేతలు మాత్రం రాకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర ఇప్పుడు తెలుగుదేశంను వీడే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఆయన సోదరుడు మస్తాన్ రావు ఇప్పటికే వైసీపీ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి రవిచంద్ర ఎప్పుడు పార్టీ మారుతారు అనేది చూడాలి. ఇక పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షుల విషయంలో చంద్రబాబు వైఖరితో సీరియస్ గా ఉన్న కొంతమంది యువ నేతలు కూడా ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై కూడా త్వరలోనే ఒక స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: