భార్యాభర్తల మధ్య బంధం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరగడం కామన్. ఆ చిన్న గొడవలు సీరియస్ గా మారితే నే అసలు తంటా మొదలు అవుతుంది. కొన్నిసార్లు భార్య భర్తల మధ్య గొడవలు విడాకుల వరకు వెళ్తూ ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పూర్తిగా కరువయ్యింది. భార్య భర్తల బంధం మధ్య సరైన అర్థం చేసుకునే గుణం లేకపోవడంతో చివరికి పెళ్లి జరిగిన కొన్ని రోజులకే పెళ్లి కాస్తా పెటాకులు గా మారిపోతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలు కారణంగా ఎంతోమంది మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయి ఈ రోజుల్లో.
ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తూప్రాన్ పట్టణానికి చెందిన బండారి రాజు అనే వ్యక్తికి ఏడాది క్రితం మండలానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. ఇక వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక ఇటీవలే మంగళవారం సమయంలో కూడా భార్యభర్తలిద్దరు మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్థాపం చెందిన రాజు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు దీంతో కుటుంబంలో తీరని విషాదం అయిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి