హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం హైదరాబాద్ లో క్రిమినల్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి అని ఆయన సూచించారు. 5 నెలల క్రితం రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో రివ్యూ మీటింగ్ జరిగింది అని... సీసీ కెమెరాలు ఎక్కువ శాతంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు అని ఆయన తెలిపారు. గత నెల రోజులుగా ప్రత్యేక డ్రైవ్ చేశాము  అన్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంలో 7000 సీసీ కెమెరాలు నేను సైతం కార్యక్రమం ఏర్పాటు చేశాము అని ఆయన తెలిపారు. వీటితోపాటు 7 లక్షల 36 వేల సీసీ కెమెరాలు మొత్తం హైదరాబాద్ లో ఉన్నాయి అని ఆయన అన్నారు.  భారతదేశంలో హైదరాబాద్ సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మొదటి స్థానంలో ఉండగా ప్రపంచంలో 6 వ స్థానంలో ఉంది అని ఆయన అన్నారు. క్రికెట్ ఐపీఎల్ బెట్టింగ్ పై 36 కేసులు నమోదయ్యాయి అని చెప్పారు. యువత భవిష్యత్తును నాశనం చేసుకోకండి అని సూచించారు.

ఇక తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి  చోరీలకు పాల్పడుతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పారు. ఆమాన్ గల్ కి చెందిన వినోద్ కుమార్ బిటెక్ చదివి మధ్యలో ఆపేశాడు అని... కార్ డ్రైవర్ గా పని చేస్తూ తన స్నేహితులు రాజేష్, షకీల్ తో కలిసి చోరీలు మొదలు పెట్టాడు అని ఆయన పేర్కొన్నారు. గతంలో పిడి యాక్ట్ మీద జైల్ కి కూడా వెళ్లి వచ్చాడు అని చెప్పారు. మళ్ళీ నిందితుడిపై పిడియాక్ట్ నమోదు చేస్తున్నాము అని పేర్కొన్నారు. వీరి కోసం నాలుగు జిల్లాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని చెప్పారు. 2017 జైల్ నుండి బయటకు రాగానే మరోసారి చోరీలకు తెగబడ్డారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: