ఇటీవల తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయాలంటూ జనసేనానికి ఆహ్వానం అందింది. అయితే కేసీఆర్ తో నేరుగా కయ్యం పెట్టుకునే ఉద్దేశం లేక పవన్ కల్యాణ్ ఉప ఎన్నికల ప్రచారానికి పోలేదు. అనూహ్యంగా బీజేపీ అక్కడ విజయం సాధించడంతో గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యానని పవన్ ఫీలయినట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో ఉప ఎన్నిక, అందులోనూ వైసీపీ సిట్టింగ్ స్థానానికి జరుగుతున్న ఎన్నిక అంటే పవన్ ఎందుకు వెనకడుగు వేస్తారు. వైసీపీ అభ్యర్థిని ఓడించేందుకు తన శాయశక్తులా కృషి చేయడానికి సిద్ధమయ్యారు.తిరుపతి లోక్ సభకు జరగబోతున్న ఉప ఎన్నికల్లో కూటమి తరపున బీజేపీ అభ్యర్థి బరిలో దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అభ్యర్థి ఎవరైనా ప్రచార బాధ్యత మాత్రం పవన్ కల్యాణ్ పైనే పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి పవన్ కూడా సుముఖంగానే ఉన్నారట. వైసీపీ అభ్యర్థిని ఓడించి, ఏపీలో జగన్ పై రివేంజ్ తీర్చుకోవాలని పవన్ ఉవ్విళ్లూరుతున్నారట. దుబ్బాక ఉప ఎన్నికల సహా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గాలి వీచింది. అదే ఊపుతో ఆ పార్టీ తిరుపతిలో కూడా గెలవాలని ఆశపడుతోంది. బీజేపీ ఆశతోపాటు.. జనసేనాని రివేంజ్ స్టోరీ కూడా ఈ ఎన్నికలతో తేలిపోతుంది. అందుకే బీజేపీకంటే ఎక్కువగా జనసేనాని ఈ ఎన్నికపై దృష్టిపెట్టారని పొలిటికల్ వర్గాల సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి