కృష్ణా జిల్లా ప్రతిపక్ష టీడీపీకి మంచి బలం ఉన్న జిల్లా. ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఇక్కడ టీడీపీ మంచి ఫలితాలు సాధించేది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ దారుణంగా ఓడిపోయింది. మొత్తం 16 అసెంబ్లీ సీట్లలో టీడీపీ కేవలం 2 గెలుచుకుంది. ఇక 14 సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. అటు ఒక ఎంపీ సీటు వైసీపీ, ఒక ఎంపీ సీటు టీడీపీ గెలుచుకుంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ వైపుకు వచ్చేశారు. అంటే వైసీపీ బలం 15కు పెరిగింది.

అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే జిల్లాలో టీడీపీ వాయిస్ ఎక్కువ వినిపిస్తోంది. ఓడిపోయినా సరే టీడీపీ నేతల హడావిడి బాగానే కనిపిస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువగా సైలెంట్‌గానే ఉంటున్నారు. 15మందిలో ముగ్గురు మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు కేబినెట్‌లో ఉన్నారు. మంత్రులుగా ఉండటంతో వీరి వాయిస్ గట్టిగానే వినిపిస్తోంది. ముఖ్యంగా కొడాలి నాని దూకుడు మామూలుగా ఉండటం లేదు. కృష్ణా జిల్లా వైసీపీ అంటే మొదట కొడాలి నాని పేరునే గుర్తుస్తోంది.

ఇక ఎమ్మెల్యేల్లో ప్రభుత్వం తరుపున గళం విప్పే నాయకులు తక్కువైపోయారు. అయితే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, ప్రతిపక్షంపై దూకుడుగానే వెళుతున్నారు. అప్పుడప్పుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిలు కూడా ప్రభుత్వానికి గట్టి సపోర్ట్‌గా ఉంటున్నారు. మీడియాలో వీరి వాయిస్ బాగానే వినిపిస్తోంది. అటు వైసీపీ వైపుకు వచ్చిన వంశీ సైతం, టీడీపీ అంటే ఒంటికాలి మీద వెళుతున్నారు. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు బాగా సైలెంట్ అయిపోయారు.

ఎవరికివారు నియోజకవర్గాలకే పరిమితమైపోయారు. అధికార పార్టీగా తమ గళాన్ని గట్టిగా వినిపించడం లేదనే టాక్ ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు జిల్లాలో వేరే నియోజకవర్గాల వారీగా తెలియదనే చెప్పొచ్చు. అయితే జిల్లాలో కొడాలి నానినే ఎక్కువగా వైసీపీని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: