ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ యాప్ లలో ఒకటి అయిన పేటీఎం తమ కస్టమర్లకు ఎన్నో మెరుగైన సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో అయితే తమ సర్వీసులను మరింత మెరుగు పరుచుకుంటూ ఆకర్షిస్తూ దూసుకుపోతుంది పేటీఎం. తమ కస్టమర్లకు వినూత్నమైన సర్వీసులను కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పుడు మరోసారి తమ కస్టమర్లను అందరికీ తీపి కబురు అందించింది పేటీఎం. పేటీఎం పోస్ట్ పెయిడ్ యూజర్లు నెలవారి బిల్లు ఇకపై సులభంగా ఈఎంఐ రూపంలో చెల్లించు  కునేందుకు అవకాశం కల్పిస్తుంది పేటీఎం. అంతే కాదు ఇలా ఈఎమ్ఐ రూపంలో చెల్లించు  కునేందుకు అవకాశం కల్పించడంతో పాటు తక్కువ వడ్డీరేట్ల కే ఈ బెనిఫిట్ పొందేందుకు అవకాశం ఉంది అంటూ అదిరిపోయే శుభ వార్త చెప్పింది.




 పోస్ట్ పెయిడ్ యూజర్లు అందరూ కూడా బిల్ టీచర్ ద్వారా వారి ఖర్చులకు తక్కువ వడ్డీ  రేట్లతో ఈఎంఐ రూపంలో మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.. సాధారణంగా అయితే పేటీఎం పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు వారి బిల్లు జనరేట్ అయిన తర్వాత వారం రోజుల్లో బిల్లు మొత్తాన్ని తప్పని సరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి బిల్లులు చెల్లించాల్సి రావడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు కానీ ప్రస్తుతం పేటీఎం తీసుకొచ్చిన సరికొత్త సర్వీస్ ద్వారా మాత్రం ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. సదరు బిల్లును ఒకేసారి కాకుండా ఈఎమ్ఐ రూపంలో చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.



 అంతేకాదు ఇక నుంచి పేటీఎం పోస్ట్ పెయిడ్ కస్టమర్లు  అందరికీ కూడా లక్ష వరకు క్రెడిట్ లిమిట్ అందించేందుకు పేటీఎం నిర్ణయించింది. ఇక దీని ద్వారా యూజర్లు వారికి నచ్చిన ప్రొడక్టులను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే పోస్ట్పెయిడ్ లో రెండు రకాల యూజర్లు ఉంటారు అన్న విషయం తెలిసిందే. పోస్ట్పెయిడ్ లైట్ లో  20వేల వరకు మాత్రమే క్రెడిట్ లిమిట్ ఉంటే.. క్రెడిట్ స్కోర్ లేని వారు ఈ బెనిఫిట్ పొందేందుకు అవకాశం ఉంటుంది. డిలైట్  అండ్ ఎలైట్  కస్టమర్లు  మాత్రం లక్ష వరకు క్రెడిట్ లిమిట్ పొందేందుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది పేటీఎం.. ప్రస్తుతం పేటీఎం తీసుకున్న నిర్ణయంతో ఎన్ని రోజుల వరకు ఇబ్బందులు పడిన కష్టమర్ లందరికీ ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: