ప్రస్తుతం ప్రపంచంలోని శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఉన్న అమెరికాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచేందుకు చైనా ఎన్నో ప్రయత్నాలు చేసింది అనే విషయం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంపు ఎన్నికైన తర్వాత మాత్రం చైనా ఆటలు ఎక్కడా సాగలేదు. చైనా పై ప్రతి విషయంలో కూడా విరుచుకుపడుతూ విమర్శలు చేయడం... అదే సమయంలో కరోనా వెలుగులోకి రావడంతో కరోనా వ్యాప్తికి చైనానే కారణమని ప్రపంచ దేశాల ముందు చైనాను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించడం లాంటివి ఎన్నో జరిగాయి. ఇక ట్రంప్ అధికారంలో ఉన్నన్ని రోజులు చైనాతో పూర్తిగా శత్రువు గానే కొనసాగారు.




 ఇక ఇటీవల రెండవసారి ట్రంప్  గెలుస్తారు అనుకుంటే ఊహించని విధంగా ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్  ఘన విజయాన్ని సాధించారు. అయితే జో బైడెన్ చైనాకు ఫేవర్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నికలకు ముందు నుంచి ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అలాంటివి ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే చైనాలోని నిపుణులు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  గురించి భయ పడుతున్నట్లు తెలుస్తోంది దీంతో చైనాకు సరికొత్త భయం పట్టుకుంది.




 ట్రంప్ యుద్ధోన్మాది కాదని... అందుకే ట్రంపు హయాంలో ఎలాంటి యుద్ధం జరగలేదు అని చైనాలోని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అయితే ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ఏదో ఒక దేశంపై యుద్ధం చేసి విజయం సాధించి  మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆ యుద్ధాన్ని ఉపయోగించుకునే వారు. కానీ ట్రంపు హయాంలో ఎలాంటి యుద్ధం  జరగ  లేదు. కానీ ప్రస్తుతం జో బైడెన్ హయాంలో మాత్రం యుద్ధం జరిగే అవకాశం ఉంది అనీ ప్రస్తుతం చేయరాని పనులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భారత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎక్కడ మోదీ వెనక్కి తగ్గడం లేదు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మోడీకి సపోర్ట్ చేస్తున్నట్లు గానే భారత్ ను  అడ్డుపెట్టుకొని అమెరికా కూడా చైనాపై యుద్ధం చేసి ఆధిపత్యం సాధిస్తే.. భారత్ తో పాటు అమెరికాకు కూడా లబ్ధి చేకూరుతుందని.. అందుకే జో బైడెన్ ఎంతో ప్రమాదకరం అని చైనా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: