సాధారణ మసాలా వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో నకిలీ మసాలాలు తయారై చివరికి ప్రాణం మీదికి తెచ్చిన ఘటనలు కూడా ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ మసాలా తయారు చేస్తున్న ముఠాను గుర్తించి పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల బయట పడిన ఘటన చూస్తే మరొకసారి మసాలా దగ్గరికి వెళ్ళాలి అంటే నే భయపడి లాంటి ఘటన బయటపడింది. సాధారణంగా ఈ మధ్య కాలంలో గరం మసాలా లు ఎక్కువగా వాడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఏ వంటకం లో అయినా మసాలాలు ఎక్కువగా వాడుతున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో మసాలాలు ఎక్కువగా వాడటం పెరిగిపోయిన నేపథ్యంలో నకిలీ మసాలా తయారు చేసి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా గాడిద పేడ ఉపయోగించి మసాలాలు తయారు చేస్తున్న ముఠాని పోలీసులు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్లోని నవీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని స్థానిక బ్రాండ్ల పేరుతో ఉన్న 300 కిలోల నకిలీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతేకాదు అక్కడ బయటపడిన వస్తువులు చూసి ఒక్కసారిగా షాకయ్యారు గాడిద పేడ, ఎండు గడ్డి తినలేని రంగులు యాసిడ్ సహ తదితర వస్తువులను కూడా సీజ్ చేశారు పోలీసులు. వీటితో కారం గరం మసాలా పసుపు లాంటివి తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి