ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...  గత కొన్ని రోజులుగా యూకే నుంచి ఏపీకి మొత్తం 1148 మంది వచ్చినట్లు గుర్తించామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. వీరిలో 1040 మంది ఆచూకీ గుర్తించినట్లు వెల్లడించింది. వీరిలో కొంత మంది నెల రోజుల కిందట వచ్చిన వారు కూడా ఉన్నట్లు తెలిపింది.శుక్రవారం కొత్తగా మరో 355 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ  అయింది.మరో 88 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

 ఆచూకీ లభించని వారిలో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. మరో 16 మంది అడ్రస్స్‌లు సరిగా లేనట్టు గుర్తించామని వెల్లడించారు. కొత్త వైరస్‌ వ్యాప్తి విషయంలో అప్రమత్తంగా ఉన్నామని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని‌ భాస్కర్ చెప్పారు. అటు తెలంగాణలో యూకే నుంచి వచ్చిన వారిలో 16 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.మొత్తం 982 మందికి పరీక్షలు నిర్వహించగా.. నలుగురుకి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.ఇక ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: