తెలంగాణ
బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు
పార్టీ అధిష్టానం నుంచి ఆకస్మికంగా పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అయితే
బీజేపీ అధిష్టానం ఆయనను ఇంత ఆకస్మికంగా ఢిల్లీకి ఎందుకు పిలిచారు అనేది ఎవరికీ క్లారిటీ లేదు. కొత్త సంవత్సరానికి ముందు రోజు ఈ విధంగా
ఢిల్లీ కి పిలిపించడం వెనక కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకునే దిశగా అధిష్టానం పెద్దలు బండి సంజయ్ తో చర్చించబోతున్నారు అనే విషయం చర్చనీయాంశం అయింది. ఇటీవల తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో పాటు, గ్రేటర్
హైదరాబాద్ మేయర్ ఎన్నికల విషయంలో అధిష్టానం పెద్దలతో బండి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల
తెలంగాణ సీఎం
కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి
కేంద్ర బిజెపి పెద్దలను కలిసి చర్చించిన పరిణామాల పైన బండి సంజయ్ తో అధిష్టానం పెద్దలు చర్చించబోతున్నట్లు సమాచారం.
తెలంగాణలో
టీఆర్ఎస్ బీజేపీలు ఉప్పు నిప్పు లా ఉన్నా, కేంద్రం విషయంలో
కేసీఆర్ కాస్త సానుకూల వైఖరితో ఉండడం, ఈ అంశాల పైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల వ్యవసాయంపై నిర్వహించిన సమీక్షలో గ్రామాలలో పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని చెప్పడం , దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కేంద్రం వ్యవసాయ చట్టం తెచ్చిందని
కేసీఆర్ బిజెపికి అనుకూలంగా మాట్లాడడం వంటి వ్యవహారాల పై
కేంద్ర బిజెపి బండి సంజయ్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే
ఢిల్లీ పెద్దల వద్ద ఒంగిదండాలు పెట్టినా,
కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదు అంటూ అప్పట్లో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం పైన
బీజేపీ పెద్దలు విపులంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అలాగే త్వరలోనే బస్సు
యాత్ర చేపట్టే ఉద్దేశంలో ఉండడం , రాజకీయంగా ఎన్నో సరికొత్త నిర్ణయాలను కొత్త సంవత్సరం లోకి తీసుకుని ఉద్దేశంతో
బీజేపీ అధిష్టానం ఉండడంతో ఆకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి తెలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది . దీనిపై రేపటి వరకు ఉత్కంఠ తప్పదు.