సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే ఉద్యోగం వ్యాపారం నిమిత్తం అనేక ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారందరూ సొంత ఊర్లకు వెళ్లడం సర్వసాధారణమైన విషయం తెలిసిందే.  సంక్రాంతి పండుగకు ఇలా సొంత ఊళ్లకు వెళ్ళడమే  అవకాశంగా మార్చుకుంటున్న దొంగలు చివరికి రెచ్చిపోయి ఎన్నో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న  ఘటనలు  తెరమీదికి వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.  ఇక ఇలా సంక్రాంతి పండుగకు నగరవాసులు సొంతూళ్లకు వెళ్లడమే ఆలస్యం ఇళ్లను కొల్లగొట్టడం చేస్తున్నారు దొంగలు.  తాళాలను పగులగొట్టి ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకు  పోతున్నారు. ఇక్కడ ఇలాగే ఎవరూ లేరని తాళం పగులగొట్టి ఇంట్లో భారీగా నగలు చోరీ చేయాలని అనుకున్నారు దొంగలు.


 కానీ గృహిణి తెలివితేటలతో ఏకంగా దొంగలు సైతం షాక్ అయ్యారు.  ఎంతో కష్టపడి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలకు  కనీసం కొంచెం కూడా బంగారం దొరకకుండా ఆ గృహిణి ఎంతో తెలివిగా ప్లాన్ చేసింది.  దీంతో దొంగతనానికి వెళ్ళి  చిల్లర తో  సరిపెట్టుకున్నారు దొంగలు. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ సూర్య నగర్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది..  సమాచారం అందుకున్న పోలీసులు దొంగతనం జరిగిన ఇంట్లోకి వెళ్లి చూడడంతో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇక బీరువాలో ఉన్న చీరలను అన్నింటిని కూడా చోరీ చేసినట్లు నిర్ధారించారు పోలీసులు.  ఇంటి యజమానులకు ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి చెప్పారు.



 అయితే ఇంట్లో 40 తులాల బంగారు ఆభరణాలు ఉండడంతో అంతా  చోరీకి గురై ఉంటాయని గృహిణి భావించింది. ఇక వెంటనే సొంతూరు నుంచి సాయంత్రానికి నగరానికి తిరిగి వచ్చారు యజమానులు. నేరుగా నగలు దాచిపెట్టిన ప్రదేశంలో వెతికారు. ఇక ఆమె దాచిపెట్టిన బంగారం మొత్తం ఎంతో సేఫ్  గా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇంట్లో దొంగలు పడినా  వారికి బంగారు దొరకకుండా గృహిణి చేసిన ఆలోచనకు అందరూ ఫిదా అయిపోయారు. ఎలాగో దొంగలు బీరువాలో చీరాల మధ్య వెతుకుతారు అని భావించి ఒక రహస్య ప్రాంతంలో గృహిణి  నగలు దాచినట్టుగా చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: