
అయితే ఇటీవల చంద్రబాబు, పార్టీలో పదవుల పంపకాలు చేశారు. అలాగే అధికార వైసీపీ కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టి మిగతా విషయాలని గాలికొదిలేసింది. పైగా అప్పులు చేసి మరీ పథకాలు అందిస్తుంది. ఈ విషయంపై కాస్త ప్రజల్లో అసంతృప్తి మొదలైనట్లు కనిపిస్తోంది. ఇక ఇదే అడ్వాంటేజ్‌గా భావిస్తున్న టీడీపీ నేతలు దూకుడుగా ఉంటున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి కూడా యాక్టివ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో శ్రావణి, జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక కొన్నిరోజులు శ్రావణి యాక్టివ్‌గా లేరు. కానీ నిదానంగా పార్టీలో తిరగడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలోని సమస్యలపై ఫోకస్ చేసి పోరాటాలు చేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకునిపోతూ, పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో శ్రావణి చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే శ్రావణి నిదానంగా సెట్ అయిపోతున్నారు.
ఇదే సమయంలో శింగనమలలో వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆమె నిత్యం ప్రజల్లోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాలు బాగా అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీతో నియోజకవర్గంలో వైసీపీకి మంచి ఊపు వచ్చింది. ఇదిలా ఉంటే నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో పద్మావతికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే గనుక జరిగితే పద్మావతికి లక్ దొరికినట్లే.