ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా సెల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. పక్కన మనుషులు ఎవరూ లేక పోయినా పర్వాలేదు కానీ సెల్ఫోన్ మాత్రం చేతిలో ఉండాల్సిందే. లేదు అంటే ఏదో మిస్ అయిపోతున్నాము  అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో ఒక్క క్షణం కూడా సెల్ఫోన్ వదిలి ఉండలేక పోతున్నారు నేటితరంలో జనాలు. ఇక గంటల తరబడి సెల్ ఫోన్ లోనే కాలం గడుపుతున్నారు.  ఈ క్రమంలోనే అటు సరికొత్త ఫీచర్లతో కూడిన సెల్ఫోన్లు కూడా మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో సెల్ఫోన్ కు  బానిసలుగా మారిపోతున్న వారు  ఎక్కువై పోతున్నారు అన్న విషయం తెలిసిందే.



 అయితే గంటల తరబడి సెల్ఫోన్ లోనే కాలం గడపడం తో  సెల్ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. ఈ సమయంలో ఆ మొబైల్ కి సంబంధించిన చార్జర్ అందుబాటులో లేని సమయంలో ఇక ఆ మొబైల్ కి వచ్చే ఇతర ఫోన్ లకు సంబంధించిన ఛార్జర్లను  వాడుతూ ఉంటారు ఎంతోమంది. అయితే ఇలా చాలా మంది ఇతరుల మొబైల్ కి సంబంధించిన చార్జర్ లను వాడుతూ మొబైల్ ను చార్జ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వాడటం మొబైల్ బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంది అని మాత్రం ఎవరూ పట్టించుకోరు.



 ఇతర చార్జర్ ల తో ఫోన్ ఛార్జ్ చేస్తే బాటరీ ఎంతగానో దెబ్బ తింటుందట. సాధారణంగా ఫోన్ నుంచి వచ్చే హిట్  తగ్గించడానికి..  హీట్ సింక్  సామర్థ్యానికి తగ్గట్లుగానే ఇక ఆయా ఫోన్లకు సంబంధించిన చార్జీలను కంపెనీలు తయారు చేస్తాయి. అంతే కాకుండా ఇక ఒక్కో కంపెనీ ఛార్జర్  ఒక్కోలాగా  తయారు చేస్తాయట. అందుకే ఇతర చార్జర్ లతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేసినట్లయితే ఇక చార్జర్ నుంచి వచ్చే హిట్ సరిపోయే అవకాశం తక్కువగా ఉంటుందని అందుకే ఇక మొబైల్ ఫోన్ బ్యాటరీ దెబ్బతింటుందని తద్వారా మొబైల్లో ఛార్జింగ్ సరిగ్గా నిలవకపోవడాని కి కారణం అవుతుంది అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: