ఇక అదే సమయంలో ఇక తెల్లవారు 10 గంటల వరకు కూడా చుట్టూ మంచూ పేరుకుపోయి ఉంటుండడంతో అందరూ ఇష్టం లేకపోయినప్పటికీ మంచు లోనే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా చలికాలంలో తరచు వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా మార్పులు జరిగిన సమయంలో ఎంతో మంది అస్వస్థతకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇలా వాతావరణంలో మార్పులు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి అని అటు నిపుణులుకూడా సూచిస్తూ ఉంటారు. అయితే వాతావరణం మారిన సమయంలో జలుబు ముక్కుదిబ్బడ లాంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రతి ఒక్కరిని.
ప్రస్తుతం చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నా జలుబు దరిచేరే అవకాశం ఉంటుంది. తద్వారా ముక్కు దిబ్బడ కూడా ఇబ్బంది పెడుతుంది. ముక్కుదిబ్బడతో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో ఉప్పు వేసి చుక్కలు ముక్కులో వేయాలి. రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా తినాలి. ఉల్లిపాయను సగానికి కట్ చేసి వాటి వాసన పీల్చాలి.నిమ్మరసం నల్ల మిరియాలు పొడి ముక్కు పై రాయాలి. అంతే కాకుండా టమాటా జ్యూస్ తాగడం వల్ల కూడా ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి