ఈ మధ్యకాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ దగ్గరికి పరుగులు పెడుతున్నారు అన్న విషయం తెలిసిందే.  అదే సమయంలో డాక్టరు ఇచ్చిన మందులు వేసుకుంటూ ఉన్నారు. ఇక చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా డాక్టర్ దగ్గరికి పరుగులు పెడుతున్నారు.  ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ కి చూపించుకోవడం మంచిదే కానీ ఎక్కువగా టాబ్లెట్లు వేసుకోవడం మందులు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది మాత్రం చాలామందికి తెలియదు.  కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని తెలిసినప్పటికీ ఇంకేం చేస్తాం ఆరోగ్యం బాగు కావాలి అంటే టాబ్లెట్స్  వేసుకోక తప్పదు కదా అని అనుకుంటూ ఉంటారు.


 అయితే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ల దగ్గరకు వెళ్లి మందులు వేసుకుంటే మంచిదే. కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం వంటింటి చిట్కాల తోనే ఆరోగ్య సమస్యల నుంచి బయట పడటం ఎంతో ఉత్తమం అని అటు వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు.  జలుబు దగ్గు కడుపు ఉబ్బరం గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ లాంటి వాటిని వంటింటి చిట్కాలతో  దూరం చేసుకోవచ్చు అని సూచిస్తూ ఉంటారు నిపుణులు.  ఈ క్రమంలోనే మనం రోజు చూసే వాడే ఆహార పదార్థాల ద్వారా మన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.



 ఇలా రోజు ప్రతి ఒక్కరు ఎక్కడో ఓ చోట తమలపాకును చూడటం కాని వాడటం  కానీ చేస్తూ ఉంటారు. అయితే ఇలా తమలపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అన్నది మాత్రం చాలామందికి. తమలపాకులు  తినడం వల్ల ఆకలి పెరుగుతుందట. అంతేకాదు తమలపాకు తినడం వల్ల కడుపు ఉబ్బరం కూడా దూరమయ్యే అవకాశం ఉందట. ఇక తమలపాకు రసం నుదిటిపై  రాస్తే తలనొప్పికి కూడా చెక్ పెట్టవచ్చట. ఇక తమలపాకు తింటే నిమిషాల్లో డిప్రెషన్ కూడా దూరం అవుతుందట. జీర్ణక్రియను వేగవంతం చేయడంతో పాటు కండరాల నొప్పిని కూడా దూరం చేస్తుందట తమలపాకు. నొప్పులున్నచోట తమలపాకు రాస్తే నొప్పి తగ్గేందుకు ఆస్కారం కూడా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: