గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో, అదే విధంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంతే కట్టు దిట్టంగా ఈరోజు జరిగిన నగర పాలక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలు మొత్తంగా 75 మున్సిపాలిటీలలో మరియు 12 కార్పొరేషన్ లలో ఎటువంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి.  గతంలో జరిగిన పోలింగు కంటే ఎక్కువగా ఓటింగు జరిగినట్లు అధికారిక సమాచారం. అయితే ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు మరియు కార్యకర్తలు ఎంతో కష్టపడి క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళారు.  

ఇదే సమయంలో ఈ నగర పాలక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు భిన్న వ్యూహాలతో ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఓటర్లను ఆయా పార్టీల నాయకులు తమ ఓటు మాకే వేయాలని వారిని ఒప్పించి, కొన్ని చోట్ల నొప్పించి ఆకట్టుకునే ప్రయత్నాలు అన్నీ జరిగి పోయాయి. ఓటర్లు చాలా తెలివైన వారు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఇచ్చే మందు సీసాలకో లేదా వారిచ్చే 1000 మరియు 2000 డబ్బులకు ఆశపడి తమ ఓటు హక్కును అమ్ముకోరు. వారికి న్యాయం ఎవరైతే చేస్తారో...చేయగలరో వారికే తమ ఓటును వేస్తారు...

ఈ రోజు జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి ప్రజలు మద్దతును ఇచ్చారో తెలిసేందుకు ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది. ఈ లోపల రాజకీయ నాయకులంతా ఎలాగైతే ఒక పరీక్ష రాసిన పిల్లవాడు ఫలితాల కోసం ఎదురు చూస్తాడో, అంతకు మించిన ఒత్తిడిని కలిగి ఉంటారు. మరి ఈ మునిసిపల్ కార్పొరేషన్ అనే ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియాలంటే 14 వ తేదీ సాయంత్రం వరకు వేచి చూడక తప్పదు అంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఈ పరీక్షలో ఎవరు పాస్ అయ్యారో, ఎవరు ఫెయిల్ అయ్యారో...ఇందులో డిస్టింక్షన్ ఎవరికి వచ్చిందో చూద్దాం మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: