తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని ఉరుకులు పరుగులు తీయిస్తున్నారు. తెలంగాణ అభివృద్ది లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యేలను, మంత్రులను వారు చేస్తున్న పనులను సమీక్షస్తున్నారు. రోజు రోజు కు హైదరాబాద్ నగరం విస్తరిస్తుంది. ప్రజల అవసరాలు కూడా విపరీతం అయ్యాయి. దీనికోసం వైద్య ఆరోగ్యం గురించి వస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అమ్మ ఆస్పత్రి  నెలకొల్పారు దీని ప్రారంభోత్సవానికి  తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి  ముఖ్య అథిధులుగా వెళ్లారు.  ఆస్పత్రిలో ఉన్న లిఫ్ట్ ను ఎక్కారు.


లిఫ్టులో ఇరుక్కున్న నాయిని నర్సింహా,మహమ్మద్ అలీ


సాంకేతిక లోపంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. లిఫ్ట్‌లో ఇద్దరు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇరుక్కున్నారు. మూడు నిమిషాల పాటు లిఫ్ట్‌లోనే ఉండిపోయారు నాయిని, అలీ.  దీంతో ఖంగు తిన్న  ఆస్పత్రి వర్గాలు, భద్రతా సిబ్బంది కాసేపు కంగారు పడింది. ఎట్టకేలకు లిఫ్ట్ నుంచి నాయిని, అలీ సురక్షితంగా బయటపడ్డారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో అంతరు కొంత సేపు కంగారు పడ్డా ఇద్దరు మంత్రులు సురక్షితంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: