బీజేపీ ఎంపీ సుజనా చౌదరీ...అవ్వడానికి బీజేపీ నేత అయినా ఈయన మనసంతా టీడీపీపైనే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా టీడీపీలో కీలక పాత్ర పోషించిన సుజనా 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత, ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బీజేపీలోకి జంప్ కొట్టారు. అయితే టీడీపీలో సుజనా ఎలాంటి రాజకీయాలు చేశారో అందరికీ తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే సుజనా టీడీపీకి ఓ పెద్ద ఫైనాన్సియర్. అలాగే చంద్రబాబుకు కుడి భుజం మాదిరిగా మెలుగుతూ, ఎన్నికల సమయంలో అభ్యర్ధులని సైతం డిసైడ్ చేసే స్థాయిలోకి వెళ్లారు.
అయితే ఇంతలా టీడీపీలో కీలకంగా ఉన్న సుజనాకు బాబు రెండు సార్లు రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇలా బాబుకు అండగా ఉన్న సుజనా 2019 ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇక బీజేపీలోకి బాబే కావాలని పంపించారనే విమర్శలు కూడా ఉన్నాయి. అధికారం కోల్పోవడంతో బీజేపీ సపోర్ట్ కోసం బాబు, సుజనాతో పాటు మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులని బీజేపీలోకి పంపారని వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది.
ఇక ఆ విమర్శలకు తగ్గట్టుగా సుజనా ఎప్పుడూ జగన్‌పైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కూడా సుజనా చౌదరీ, జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతల తీరుతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీలు భయపడుతున్నాయని, ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నాయని, వైసీపీకి 22 మంది ఎంపీలను గెలిపిస్తే ఏపీకి ఏం సాధించారని ప్రశ్నించారు. అలాగే ప్రత్యేక హోదాను వైసీపీ, టీడీపీలు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయని, పుదుచ్చేరికి హోదా ఇచ్చారంటూ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు ప్రధానమంత్రి అయినా ఏపీకి హోదా ఇవ్వలేరని అన్నారు. అయితే సుజనా బీజేపీలోకి వెళ్ళి రాష్ట్రం కోసం కంటే చంద్రబాబు కోసమే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కేంద్రంలో ఉంటూ రాష్ట్రం కోసం తెచ్చింది శూన్యం. ఇక బాబు, ప్రధాని అయినా హోదా ఇవ్వలేరని సుజనా అంటున్నారు. అంటే ఇక్కడ బాబు ప్రధాని కావాలనే కోరికని సుజనా బయటపెట్టినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి