ప్రస్తుతం భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో టీకా కొరత ఏర్పడింది. సెకండ్ వేవ్ లో విజృంభిస్తున్న కరోనా లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈసారి విజృంభిస్తున్న కరోనా కారణంగా రోగులు శ్వాస ఇబ్బంది తో అల్లాడి పోతున్నారు. దీనివల్ల ఆక్సిజన్ బెడ్స్ నిండుకుంటున్నాయి. ఆక్సిజన్ బెడ్స్ కొరత కూడా ఎంతోమంది ప్రాణాలను బలిగొంటోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయడం ద్వారా ఆసుపత్రులకు పోటెత్తే రోగులను తగ్గించవచ్చు. అందుకే కేంద్ర ప్రభుత్వం అందరికీ టీకాలు వేసి పరిస్థితిని కంట్రోల్లోకి తేవాలని బాగా ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే ఇప్పుడున్న టీకా లతో పాటు సరికొత్త టీకాలను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై కేంద్ర బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్‌ మాట్లాడుతూ ప్రస్తుతం మరో నాలుగు కరోనా టీకాలపై పరిశోధనలు జరుగుతున్నట్టు వెల్లడించారు. జైడుస్‌ క్యాడిలా, బయోలాజికల్‌ ఈ, జెన్నోవా సంస్థలతో పాటు ముక్కు ద్వారా వ్యాక్సిన్ వేసేందుకు భారత్‌ బయోటెక్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆమె వెల్లడించారు.

అయితే 4 టీకాలలో మూడు టీకాలకు ఎమర్జెన్సీ కేసులలో యూస్ చేసేందుకు ఆమెదం తెలిపామని ఆమె అన్నారు. అయితే ఈ నాలుగు టీకాల పై పరిశోధనల నిమిత్తం రూ.400 కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నట్టు ఆమె తెలిపారు. అయితే 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రేణు స్వరూప్ నాలుగు కొత్త టీకాల గురించి వెల్లడించారు.

ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్న 4 టీకాల తో పాటు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాలు ఉన్నాయని ఆమె చెప్పారు. దేశ అవసరాల కోసం అతి తక్కువ సమయంలోనే అత్యధిక సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసే దిశగా తాము ముందడుగులు వేస్తున్నామని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: