కరోనా గురించి ఇప్పుడు చాలా మందికి తెలిసింది. కరోనా  ఎలా మనిషి దెబ్బ తీస్తోంది.. దాన్నుంచి ఎలా కాపాడుకోవాలనే అంశంపై అవగాహన పెరిగింది. అయితే రోగుల్లో నిర్లక్ష్యం చావుల సంఖ్య ను పెంచుతోంది. అసలిప్పటిదాకా డాక్టర్లను కలవకుండా ఇంట్లో వైద్యం తీసుకుని  లేకపోతే నమ్మకం ఆధారంగా పని చేసే మందులు వేసుకుని మాకు అర్జెంటు గా బెడ్ కావాలని ఫోన్లు చేసేవారు రోజూ ఉంటున్నారు. ఆక్సిజన్ శాతం పడిపోతే డాక్టర్ ఆసుపత్రి అడ్మిషన్ అవసరం అని చెప్పాక కూడా కొంతమంది తాత్సారం చేయడం ఈ రెండో వేవ్ లో అధికంగా ఉంది.

వీళ్ళను పక్కింటి వాళ్ళూ ఎదురింటి వాళ్ళూ ప్రభావితం చేస్తూ ఉంటారు. దానిమూల్యం భారీగా ఉంటుంది. ఆక్సిజన్ శాతం పడిపోతున్నా ఆసుపత్రిలో చేరితే రికవరీ చాలా బాగుంటుంది. 90 శాతం ఉన్నపుడు చేరిన వారు లేదా 80 శాతం ఉన్నపుడు చేరినా వారూ రికవరీ ఔతారు. 90 % ఉన్నవారు పది రోజుల్లో రికవరీ ఐతే 80% ఉన్నవారు రికవరీ కావడానికి నెల పట్టవచ్చు. అంత తేడా ఉంటుంది. అందుకే త్వరగా అలర్ట్ కావడం ముఖ్యం. 90% ఉండగా సరేలే రేపు చూద్దాం అనుకునే వారు ఈ రెండోవేవ్ లో పెరిగారు.

ఈ నిర్లక్ష్యం చాలా మంది ప్రాణాలు తీస్తోంది.  మొదటివేవ్ లో పరిస్థితి ఇలాలేదు. ఐతే ఆక్సిజన్ ఎంత శాతం తగ్గినా గతంతో పోలిస్తే రికవరీలు పెరిగాయి. కారణం డాక్టర్లకు జబ్బుపై అవగాహన పెరగడం. చికిత్స చేయడం సులువవడం. రెండవది మెడికల్ స్టాఫ్ వాక్సిన్ వేసుకుని ఉండటం వలన కొంత నిర్భయంగా చికిత్స అందించగలగడం. వాళ్ళ యాటిట్యూడ్ లో మార్పు రావడం. వెంటిలేటర్లు చాలా తక్కువ శాతం మందికే అవసరం ఔతుంది. ఒక వ్యక్తి కి ఎక్కువగా ఒక వ్యక్తికి తక్కువగా ఎందుకు ఉంటుందంటే  వైరల్ లోడ్ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది.

వైరస్ ని ఎదుర్కోనెందుకు  బాడీ చూపే రియాక్షన్ సైటోకైన్ స్టాం. రెండవ వారంలో వైరస్ వలన చనిపోవడం జరగదు. సైటోకైన్ స్టాం వలన చనిపోతారు. ఈ విపరీత సైటోకైన్ స్టాం ని సకాలంలో గుర్తించడం దానిని అదుపులోకి తేవడమే వైద్యుడు చేసే పని. అంచనా వేసి చెప్పగలడు డాక్టరు. అందుకు తగ్గ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేయగలరు.  అవసరం అనుకుంటే ఆసుపత్రిలో అడ్మిట్ కమ్మని వైద్యుడు చెప్పగలరు.


మరింత సమాచారం తెలుసుకోండి: