గతేడాది చైనాలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం సృష్టించింది. ఈ వైరస్ బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది జీవనోపాధిని కోల్పోయారు. ఇక ఈ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడుకునేందుకు కొన్ని దేశాలలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మహమ్మారిని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టి మళ్ళీ యధాస్థితికి చేరుకుంటున్న సమయంలో పలు దేశాలలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది.

ఇక గతేడాది కంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ దారుణంగా మారింది. ఇక ఈ వైరస్ బారిన పడి గతేడాది కంటే ఎక్కవ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇదిలా ఉంటే మరో వైపు ఈ మహమ్మారి నుండి కోలుకున్న వారికీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. తాజాగా  ఇటలీ శాస్త్రవేత్తలు  తెలిపిన వివరాల ప్రకారం.. కోలుకున్నవారిలో యాంటీబాడీలు కనీసం 8 నెలల పాటు కొనసాగుతాయని వాళ్ళు వెల్లడించారు. ఇక ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత, బాధితుల వయసు, ఇతర అనారోగ్య సమస్యలు వంటి అంశాలతో సంబంధం లేకుండానే వీటి స్థాయి ఉంటుందని చెప్పారు.

అయితే గత ఏడాది కొవిడ్‌-19 మొదటి ఉద్ధృతి సందర్భంగా మిలాన్‌లోని ఒక ఆసుపత్రిలో చేరిన 162 మంది కరోనా బాధితులపై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు.. ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో వీరి నుంచి రక్త నమూనాలు సేకరించారు. నవంబరు చివర్లో మరోసారి వాటిని తీసుకున్నారు. ‘‘కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీల ఉనికి వీరిలో క్రమేణా తగ్గుతోంది. అయితే వ్యాధి సోకిన 8 నెలల తర్వాత కూడా వాటి ఉనికి ఉంది. అన్ని నెలల తర్వాత ముగ్గురిలో మాత్రమే ఇవి లేవు’’ అని పరిశోధకులు తెలిపారు. బాధితుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకిన 15 రోజుల్లోగా యాంటీబాడీలు ఉత్పత్తి కాకుంటే వారిలో కొవిడ్‌ తీవ్ర రూపం దాలుస్తుందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: