ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకి ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో 4 లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు రికార్డవుతున్నాయి. ఇక అలాగే మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక బయటకి వస్తే ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. ఇంకా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. ఇక కరోనా ఉధృతి నేపథ్యంలో కొంతమంది ప్రజలు నిర్లక్ష్యంగా వుంటున్నారు. జాగ్రత్తలు పాటించకుండా కరోనా బారిన పడుతున్నారు. అయితే కొంతమంది ప్రజలు మాత్రం చక్కగా స్వచ్ఛందంగా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆ కోవలోనే మదనపల్లె పట్టణ సమీపంలోని సుధాకర్‌ అనే పాల వ్యాపారి కాస్త వినూత్నంగా ఆలోచించి సురక్షిత పద్ధతిలో పాల కొనుగోలు, అమ్మకాలను సాగిస్తున్నాడు. ఎంతో వినూత్నంగా ఆలోచించి తన ఇంటి ముందు ప్రధాన గేటు వద్దనే రెండు పెద్ద పైపులు ఏర్పాటు చేశారు.


అందులో ఒకటి పాడి రైతులు తనకు పాలు పోయడానికి, మరో పైపు కొనుగోలుదారులకు తాను పాలు పోయడానికి ఏర్పాటు చేసుకున్నారు. కొనుగోలుదారులు డబ్బులు గేటు వద్ద పెడితే ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని పైపు ద్వారా పంపుతున్నారు. పాడి రైతులు తీసుకొచ్చే పాలు పైపులో పోస్తే లోపల క్యానులో పడుతున్నాయి.పాలు కొలత కోసం వేబ్రిడ్జి కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది జనాలు కనీస బాధ్యత లేకుండా వున్న ఈ కరోనా టైంలో కరోనా ప్రబలకుండా భౌతికదూరం పాటించేందుకు సుధాకర్‌ చేసిన ఈ సరికొత్త ఆలోచనకు చాలా మంది ఆకర్షితులయ్యి వావ్ వాట్ ఎన్ ఐడియా సర్జీ అని సుధాకర్ ని బాగా మెచ్చుకుంటున్నారు. సమాజం పట్ల బాధ్యతగా వుండేలా చాలా మందికి ఇతను ఆదర్శం అవుతున్నాడు. నిజంగా గ్రేట్ కదూ...కాబట్టి మీరు కూడా ఇలా బాధ్యతాయుతంగా వ్యవహరించండి. కరోనా మహమ్మారి దరి చేరకుండా జాగ్రత్తలు పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: