ఇప్పుడున్న సెకండ్ వేవ్ లో అందరి నోట వినిపిస్తున్న ఒకే ఒక్క మాట నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన నాటుమందు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దీని గురించే జోరుగా చర్చ జరుగుతోంది. కొందరేమో బాగుంది వేసుకోవాలంటూ, మరి కొందరేమో ప్రమాదం వద్ద అంటూ వాదనలు వినిపిస్తున్నారు. ఏ ఛానల్‌లో చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఇప్పుడు దీని పైనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ ఆయుర్వేద డాక్టర్ కరోనాకు మందు ఇవ్వడం మొదలు పెట్టారు. మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన బచ్చలి భీమయ్య అనే వ్యక్తి కరోనాకు నాటుమందు పంపిణీ చేస్తున్నాడు. గతంలో సింగరేణి కార్మికుడిగా పని చేసిన ఆయన పదవీ విరమణ తర్వాత ప్రజలకు ఏదైనా చేయాలని భావించారు.
ఇందులో భాగంగానే తనకు తెలిసిన ఆయుర్వేద విద్యతో కరోనా పేషెంట్లకు ఏదైనా చేయాలని భావించాడు. తెలిసిన మెటీరియల్ ఉపయోగించి కరోనా కు ఓ మందును తయారు చేశాడు. ఇప్పటి వరకు 300 మంది కరోనా పేషెంట్లను తన మందుతో ఆరోగ్యవంతుల్ని చేశానని ఆయన చెబుతున్నాడు. ప్రభుత్వం అనుమతిస్తే మందును పెద్ద మొత్తంలో తయారు చేస్తానని, అప్పుడు పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన వివరిస్తున్నాడు.
తన మందుతో రెండు గంటల్లోనే నయం చేస్తున్నానని వెల్లడించాడు. ఈ మందును మూలికలతో తయారు చేసే జ్ఞానం తనకు వంశపారంపర్యంగా వచ్చిందని బచ్చలి భీమయ్య స్పష్టం చేశాడు. తన తాత దగ్గర నుంచి తాను వైద్యం గురించి తెలుసుకున్నానని, అప్పటి నుంచే తనకు ఆయుర్వేదంపై పట్టు ఉండేదని వివరించాడు. 13 వనమూలికలతో తయారు చేసిన మందు కరోనా పేషెంట్లకు బాగా పని చేస్తుందని తెలిపాడు. ఇక భీమయ్య ఇస్తున్న మందు గురించి పోలీసులకు తెలిసింది. ఈ విషయంపై మందమర్రి సీఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ.. భీమయ్య మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని, కాబట్టి ప్రజలు తీసుకోవద్దని స్పష్టం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి