న‌వీన‌త్‌కౌర్ అంటే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో, రాజ‌కీయాల్లో పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ఆమె సినిమాల్లోమంచి పేరు తెచ్చుకుంది. కానీ ఎప్పుడైతే ఆమె రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్ప‌టి నుంచే ఆమె దేశ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగామారింది. ఎంపీలంద‌రిలో ఆమె క్రేజ్ ఉన్న స‌భ్యురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చాలామందికి ఇన్స్ ఫిరేష‌న్ గా నిలిచింది.


అయితే ఇప్పుడు ఆమెకు షాక్ త‌గిలిన‌ట్టు తెలుస్తోంది. ఆమె నకిలీ కుల న‌మూనా పత్రాల‌ను సమర్పించిందని ఆమెకు బాంబే హైకోర్టు రూ. 2 లక్షల జరిమానా విధించిడం సంచ‌ల‌నంగా మారింది.  దీంతో ఆమె త‌న ఎంపీ పదవిపై ప్ర‌భావంఏర్పడే అవకాశం ఉందనే ఊహాగానాలు న‌డుస్తున్నాయి. బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ విచార‌ణ జ‌రిపి ఈ మేరకు న‌వనీత్ కౌర్‌కు జరిమానా విధించిన‌ట్టు స‌మాచారం.



అయితే న‌వ‌నీత్ కౌర్ త‌న కుల సర్టిఫికెట్లు సరైనవే అని నిరూపించు కునేందుకు కోర్టు ఆమెకు నెల రోజుల టైమ్ ఇచ్చింది. ఆమె ఒకవేళ ఈ నెలలోపు కుల స‌ర్టిఫికెట్ల విషయాన్ని నిరూపించలేకపోతే ఆమెకు ఉన్న లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉందని స‌మాచారం. కానీ ప‌ద‌వి విష‌యంలో కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేద‌ని తెలుస్తోంది. ఇక కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశాల్లో ధ‌ర్మాసనం స్ప‌ష్టంగా తెలిపింది.



ఇక ఇదే బాంబే హైకోర్టు తీర్పుపై ఎంపీ నవనీత్ కౌర్ తాజాగా మాట్లాడుతూ.. తాను కోర్టు తీర్పును ఎల్ల‌ప్పుడూ గౌరవిస్తానని, ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతానంటూ స్ప‌ష్టం చేశారు. అక్కడ తనకు న్యాయం జరుగుతుందని కౌర్ వెల్ల‌డించారు. ఇక కోర్టులో శివసేన నాయకుడు ఆనందరావు ఆద్సుల్ త‌న‌పై చేసిన ఫిర్యాదుపై బాంబే హైకోర్టు ఈ మేర‌కు విచార‌ణ జ‌రిపి తీర్పు ఇచ్చింది. నవనీత్ కౌర్ ప్ర‌స్తుతం అమ‌రావతి నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయం సొంతం చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: