ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో మరువలేని జ్ఞాపకాలు ఉంటాయి. ఇక వృద్ధాప్యంలో ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన జ్ఞాపకమే. అయితే ఇక్కడొక మహిళకు మాత్రం ఏకంగా ఒక్కసారి కాదు కట్టుకున్న భర్తనే రెండోసారి కొత్తగా పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది. ఈ పెళ్లికి పెద్దగా ఏకంగా సొంత కూతురే పెళ్లి పెద్దగా మామారింది.  ఇక అంతకంటే అదృష్టం ఏముంటుంది.  ఆ మహిళకు రెండోసారి కట్టుకున్న భర్తనే పెళ్లి చేసుకునే అవకాశం ఎలా వచ్చింది అంటారా.



 దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది.. అమెరికాకు చెందిన  56 ఏళ్ల పీటర్ మార్షల్ అనే వ్యక్తి కొన్నేళ్ల  క్రిందట లీసా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకే అతనికి అల్జీమర్స్ వ్యాధి వచ్చింది ఫలితంగా క్రమ క్రమంగా అన్ని మర్చిపోవడం మొదలయ్యింది. చివరికి సొంత ఇంటిని. కట్టుకున్న భార్యను. పిల్లలను కూడా మర్చిపోయాడు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే పక్కనే ఉన్న భార్యని నీవు ఎవరు అని అడిగేవాడు. కొన్నాళ్లపాటు బాధపడిన సదరు మహిళ.. తర్వాత  భర్తకు రోజు నేను నీ భార్యను అంటూ చెప్పటం మొదలు పెట్టింది.


 అయితే ఓ రోజు తన భర్తకు అన్ని గుర్తు చేసేందుకు భార్య పెళ్లి వీడియో చూపించింది. అయితే భర్తకు ఏం గుర్తు రాలేదు.. కానీ ఒక మధురమైన సంఘటన చోటు చేసుకుంది.  అచ్చం వీడియోలో ఉన్న లాగానే మనం పెళ్లి చేసుకుందామా అని కట్టుకున్న భార్యనే అడిగేసాడు పీటర్ మార్షల్. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో ఆమె ఆనందంలో ఎస్ అంటూ చెప్పేసింది. తన భర్త జ్ఞాపక శక్తి కోల్పోయినప్పటికీ తన మీద ప్రేమ మాత్రం అలాగే ఉంది అంటూ సదరు మహిళ తెలిపింది. రెండోసారి పీటర్ మార్షల్ తో పెళ్లికి సిద్ధమైంది. పెళ్లికి పెద్దగా సొంత కూతురు వ్యవహరించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: