భారత పార్లమెంట్ సభ్యుడు, జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ రోజు తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ దంపతులకు పెద్ద కుమారుడైన రాహుల్ గాంధీ 1970, జూన్ 19వ తేదీన న్యూఢిల్లీలో జన్మించారు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సమయంలో అగంతకులు నుంచి హాని ఉందని అతను చాలా సార్లు తన స్కూల్ చేంజ్ చేశారు. ఆయన తన పాఠశాల విద్యను న్యూఢిల్లీ, డెహ్రాడూన్ లలో పూర్తి చేశారు. నానమ్మ ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత ఆయన తన చెల్లెలతో కలిసి హోమ్ స్కూల్లోనే చదువుకున్నారు. అనంతరం 1989లో ఢిల్లీలోని స్టెఫెన్ కాలేజ్ నుంచి హిస్టరీ సబ్జెక్ట్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా కి వెళ్లారు. అయితే ఆయన తండ్రి రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురికావడంతో రాహుల్ గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చారు. తరువాత ఫ్లోరిడాలోని రోలిన్స్ కళాశాలలో జాయిన్ అయ్యారు.
భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ గాంధీ తన పేరును రౌల్ విన్సీ గా మార్చుకొని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ట్రినిటీ కాలేజీలో చేరి ఎం.ఫిల్ చదువు పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాలు, అభివృద్ధి కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆయన పనిచేయడం ప్రారంభించారు. లండన్ లోని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన మానిటర్ కంపెనీ గ్రూప్ లో చేరి కొంతకాలం పని చేశారు. 2002వ సంవత్సరంలో తిరిగి స్వదేశానికి వచ్చేసిన రాహుల్ గాంధీ ముంబైలో ఔట్‌సోర్సింగ్ సంస్థ బ్యాకాప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు.

2004వ సంవత్సరంలో తాను పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని ప్రకటించిన రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. మే 2011లో ఉత్తరప్రదేశ్‌లోని భట్టా పార్సాల్ గ్రామంలో రైతులను కలవడానికి వెళుతున్నప్పుడు రాహుల్ గాంధీని తొలిసారిగా అరెస్టు చేశారు.



రాహుల్ గాంధీ జపాన్ యుద్ధ కళ అయిన ఐకోడోలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించారు. అతని కోచ్ సెన్సే పారిటోస్ కార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి తాను 2009 నుంచి శిక్షణ ఇస్తున్నానని వెల్లడించారు. రాహుల్ కత్తి-పోరాటం, బ్రెజిలియన్ జియు-జిట్సు యుద్ధ కళలలో కూడా శిక్షణ తీసుకున్నారు.



2012లో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబానికి రాహుల్ గాంధీ అండగా నిలిచారు. నిర్భయ సోదరుడిని బాగా ప్రోత్సాహించి.. పైలట్ శిక్షణా కోర్సును పూర్తి చేయడంలో అతనికి రాహుల్ బాగా సహాయపడ్డారు. ఈ విషయాన్ని నిర్భయ తల్లి ఆశా దేవి మీడియాతో వెల్లడించారు.

రాహుల్ గాంధీకి ఆఫ్ఘన్ యువరాణితో సంబంధం ఉన్నట్లు సండే గార్డియన్ వార్తలు ప్రచురించింది. కొన్నేళ్ల తరువాత, ఆఫ్ఘన్ యువరాణి ఈజిప్ట్ యువరాజుతో వివాహం చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తుంటారు కానీ రాహుల్ గాంధీ వారిని ఎంతో గౌరవిస్తుంటారు. అది ఆయన మంచితనానికి మచ్చుతునక అని అభిమానులు అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: