
సీడ్ యాక్సిస్ రోడ్ దాదాపుగా పూర్తి అయింది.అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ఆగిపోయాయి. దీనికి తోడు అసెంబ్లీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజధాని ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.రాజధాని ప్రాంతంలో సైతం వైసీపీకే ప్రజలు పట్టంకట్టారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.ఉద్యమం చేస్తున్న రైతులకు,ప్రతిపక్షాలు కూడా అండగా నిలిచాయి.మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో కూడా రైతులు పిటిషన్లు వేశారు.దీంతో రాజధాని తరలింపు పక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది.రాజధాని అమరావతిగానే కొనసాగించాలంటూ ఈ రోజుకి రైతులు ధర్నాలు చేస్తున్నారు.
ఇదిఇలా ఉంటే తాజాగా అమరావతికి గుండెకాయ లాంటి ఐకానిక్ బ్రిడ్జికి సబంధించిన ప్లాట్‌ఫామ్‌లను ధ్వసం చేయడం ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేచింది.ధ్వసం చేసిన ఐకానిక్ ఫ్లాట్ ఫామ్‌లను రాజధాని దళిత జేఏసీతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు.రెండు జిల్లాలకు అనుసంధానమైన ఐకానిక్ బ్రిడ్జ్‌ని కూల్చడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఐకానిక్ బ్రిడ్జ్ కూల్చడంపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.విధ్వంసాలు చేయడం తప్ప అభివృద్ది ఎక్కడా లేదని ఆయన ఆరోపించారు.2024లో చంద్రబాబు సారథ్యంలో ఈ ఐకానిక్ బ్రిడ్జి కట్టితీరుతామని ఆయన సవాల్ చేశారు.చంద్రబాబు నిర్మాణం చేస్తే మీరు పడగొడతారా అని జగన్‌ని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయవద్దని మాజీమంత్రి దేవినేని హెచ్చరించారు.