2009 డిసెంబర్ లో ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సుమారు 18 రోజుల పాటు నిరాహార దీక్ష నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లోనే సుమారు వారం రోజుల పాటు దీక్ష చేసిన చింతమనేనిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ.. మొక్కవోని పట్టుదలతో తన దీక్షను కొనసాగించారు ప్రభాకర్. ఆ తర్వాత కూడా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాకు ఎన్నిసార్లు వచ్చినా ముందుగా అడిగే ప్రశ్న ఒకటే.. ప్రభాకర్ ఎక్కడా... ఎలా ఉన్నావు... అని కుశల ప్రశ్నలు తప్పనిసరి. 2014 ఎన్నికల్లో జిల్లాలో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో చింతమనేని ఒకరు. అందరూ మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. అయితే సమీకరణ కారణంగా మంత్రి పదవి దక్కనప్పటికీ.. విప్ పదవి దక్కింది చింతమనేనికి. గోదావరి జలాలు కృష్ణా నదికి తరిలించేలా పట్టిసీమ నిర్మాణం పూర్తి విషయంలో కూడా చింతమనేని పాత్ర ఉంది. కొల్లేరు లంక గ్రామాలున్న దెందులూరులో అన్నివర్గాల ప్రజలు అందుబాటులో ఉంటూ వస్తున్నారు చింతమనేని. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ... ఇప్పటికీ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై తనపై ఎన్ని కేసులు బనాయించినా కూడా... ఏ మాత్రం అధైర్య పడలేదు. అదో ఊరు, ఉత్సాహంతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాడు. ప్రజా సమస్యలపై పోరాటానికి ఎప్పటికీ ముందు ఉంటానంటున్నారు చింతమనేని ప్రభాకర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి