ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని స్థాపించి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జనసేనాని విఫలమయ్యాడని చెప్పాలి. ఎన్నో అంచనాలతో పార్టీని స్థాపించిన పవన్ కు సైతం ప్రజల్లోకి ఎలా వెళ్లాలో క్లారిటీ లేదని స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకో రెండున్నరేళ్ల కాలంలో మళ్లీ ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏపీలో జనసేన పార్టీ మనుగడ కొనసాగాలంటే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళితేనే అది సాధ్యపడుతుంది. ప్రస్తుతం అటు టీడీపీ ఇటు వైసీపీ లు పాలనలో దారుణమైన విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఏపీలో ప్రత్యామ్నాయంగా మేమున్నామని ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇందుకోసం ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై రాజకీయ విశ్లేషకులు కొన్ని సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎప్పుడైనా రాజకీయాలలో పరిస్థితులను బట్టి మన ప్రణాళికను మార్చుకోవాల్సి ఉంటుంది. గతంలో లాగే ఈ సారి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. కాబట్టి ఒంటరిగా పోటీ చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రజల్లో జనసేనకు మంచి అభిప్రాయమే ఉంది. దీనికి తార్ఖానమే ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేనకు లభించిన ఓట్లు. ఈ కాస్త అవకాశాన్ని పెద్ద స్థాయిలో ఓటు షేర్ సాధించేందుకు ఉపయోగించుకోవాలి.

ఎప్పటిలాగే రాజకీయాల్లో అందరూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ ఉంటారు. కానీ ఈ పద్దతి ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు. మనము పార్టీగా ఏమి చేయగలమో ప్రజలకు తెలియచేయాలి. మన ఉద్దేశ్యాన్ని వారికి తెలియచేయగలిగితే అక్కడే మనము విజయం సాధించినట్టు అవుతుంది. ఎన్నికలు రావడానికి ఇంకా సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడక తప్పదు. ఇప్పటి నుండే అన్ని రకాల సమీకరణాలను ఆలోచించుకుని ప్రణాళికలు చేసుకోవడం ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయాలను జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంత వరకు పాటిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: