నిర్మల్ జిల్లాలోని హిందూ వాహిని సభలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు  ధర్మపురి అర్వింద్.. తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పై   మరోసారి షాకింగ్  కామెంట్స్ చేశారు. సిఎం  కేసీఆర్ ను ఖతం చేయడానికి మూడు నెలల కూడా సమయం పట్టదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  దేశంలో హిందువు లకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు ఆయన దాని నుంచే కేసీఆర్ నేర్చుకున్నారని నిప్పులు చెరిగారు.  

తెలంగాణ రాష్ట్రం లో  గులాబీ అండర్ వేర్లు వేసుకున్న కొందరు పోలీసు అధికారులు రోహింగ్యాలకు పాస్ పోర్టులు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు ధర్మపురి అర్వింద్.  రాబోయే భారతీయ జనతా పార్టీ  ప్రభుత్వం లో తప్పుడు పాస్ పోర్టు ఇచ్చిన అధికారులను బోనులో నిలబెడతామని హెచ్చరించారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని మండి పడ్డారు.  దళిత జపం చేస్తున్న రేవంత్ రెడ్డి ... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తమని ప్రకటించగలడా ? అని నిలదీశారు ధర్మపురి అర్వింద్.  

బిఎస్పీ లో చేరిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు ధర్మపురి అర్వింద్.  అయితే కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించడం అవమాన కరమన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని.. ప్రజలు ఏనాడూ నమ్మబోరని పేర్కొన్నారు ధర్మపురి అర్వింద్. తెలంగాణ రాష్ట్రం లో అధికార టిఆర్ఎస్ పార్టీ కి భారతీయ జనతా పార్టీ నే అసలైన ప్రతిపక్షం అని ధర్మపురి అర్వింద్ మరో సారి స్పష్టం చేశారు.ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా హుజూరాబాద్ నియోజక వర్గం లో బిజేపి పార్టీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు అర్వింద్ .

మరింత సమాచారం తెలుసుకోండి: