ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు కాస్త క్లారిటీ మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్తితుల్లో ఎలా రాజకీయం చేయాలో ఆయనకే సరిగ్గా క్లారిటీ ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు నెక్స్ట్ ఈయన టి‌డి‌పి నుంచే బరిలో దిగుతారా? లేక వేరే పార్టీకి వెళ్తారా? అది కాదు అనుకుంటే ఆయన తనయుడు బరిలో ఉంటారా? ఇలాంటి ప్రశ్నలకు ఏ మాత్రం సమాధానాలు రావడం లేదు.

అసలు ఏపీ రాజకీయాల్లో రాయపాటి చాలా సీనియర్ నాయకుడు. కమ్మ వర్గానికి చెందిన రాయపాటి దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. గుంటూరు నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈయన కాంగ్రెస్‌ని వదిలి టి‌డి‌పిలోకి వచ్చేశారు. 2014 ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఐదేళ్ల పాటు ఎంపీగా గొప్ప పనితీరు ఏమి కనబర్చలేదు. ఈయన సొంత వ్యాపారాలనే ఎక్కువగా చూసుకున్నారు.

ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి రాయపాటి అనేక ట్విస్ట్‌లు ఇచ్చారు. తన కుమారుడు రంగబాబుకు సత్తెనపల్లి సీటు ఇస్తేనే తాను నరసారావుపేట పార్లమెంట్‌లో పోటీ చేస్తానని చంద్రబాబుకు కండిషన్ పెట్టారు. కానీ అప్పటికే సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ ఉండటంతో రాయపాటికి బాబు సర్ది చెప్పి, నరసారావుపేట బరిలో నిలబెట్టారు. కానీ జగన్ గాలిలో రాయపాటి ఓడిపోయారు. ఓడిపోయాక టి‌డి‌పికి దూరం జరిగారు. ఒకానొక సమయంలో బి‌జే‌పి లేదా వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది గానీ, రాయపాటి ఎటు వెళ్లలేదు.

అలా అని టి‌డి‌పిలో యాక్టివ్‌గా లేరు. కానీ ఆయన తనయుడు రంగబాబు టి‌డి‌పిలోనే పనిచేస్తున్నారు. అయితే ఆయన సత్తెనపల్లి కోసం గట్టిగానే ట్రై చేశారు. కానీ ఆ సేతు కోడెల తనయుడు శివరాంకే దక్కింది. దీంతో రాయపాటి ఫ్యామిలీకి నరసారావుపేట ఒక్కటే ఆప్షన్‌గా ఉంది. మరి ఈ సీటులో ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. లేదా బాబుకు హ్యాండ్ ఇచ్చి వేరే పార్టీలోకి జంప్ చేస్తారనే అంశంపై కూడా క్లారిటీ రావడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp