సీనియర్ రాజకీయ నాయకులు అయ్యన్న పాత్రుడు నాకుమంచి స్నేహ పాత్రుడు అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. మై సన్ అని ఏందుకు అన్నారో అయ్యన్న పాత్రుడు ఇప్పటికే వివరణ ఇచ్చారు అని గుర్తు చేసారు. పదివి కాంక్ష తో రగిలి పోతున్నాడు జోగి రమేష్ అని జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇంటి దగ్గర కి వందలాది కార్లు , వ్యక్తులు, రాళ్ల తో శాంతి దండయాత్ర చేస్తారా ? అని నిలదీశారు. కాల్చి చంపాలి సహా ఇంకా అనేక సార్లు చాలా చాలా నిచాతి నీచం గా మాట్లాడారు మా మంత్రులు, ఎమ్మెల్యే లు, నాయకులు అని ఆయన వ్యాఖ్యానించారు.

బూతులు మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యే లు సహ అనేక మంది మా పార్టీ నాయకులు అందరి తరఫున  మా ముఖ్యమంత్రి గారు క్షమాపణ కోరితే మనం అయ్యన్న పాత్రుడు అన్న  మై సన్ అన్న దానికి చంద్రబాబు నాయుడు గారిని అడగవచ్చు అని అన్నారు ఆయన. నన్ను జోగి రమేష్ లుచ్చా, వెదవ అని తిట్టినందుకు జగన్ గారు కితాబు లు ఇచ్చారు కదాఅని గుర్తు చేసారు. మొత్తం దీని వెనుక ఎవరూ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అన్న ఆయన... లుచ్చా, వెదవ అని తిట్టి గతం లో అభినందలలు అందుకొని పులకించిన జోగి మంత్రి పదవి కోసమే  మళ్లీ దాడికి దిగబడ్డాడు అని విమర్శించారు.

మై సన్ అనేదనికే మనం క్షమాపణలు కోరితే ఇంతకంటే దారుణంగా  మన మంత్రులు, ఎమ్మెల్యే లు, నాయకులు మాట్లాడిన దానికి  ప్రతిపక్షాల వాళ్ళు రాళ్లు పుచ్చుకొని తాడేపల్లి కి వస్తే అని ప్రశ్నించారు. బేషరతు గా ముందు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసారు.  జోగి ని లుచ్ఛా అనటం ఎంతసేపు కాని నేను యోగిని అన్నారు.  నన్ను బ్రతిమలాడి పార్టీలో కి తీసుకుంది ఎవరో ఒక సారి జగన్ గారిని అడుగురా జోగి.. నా ఫేస్ తో నేను గెలిచా రా జోగి అంటూ ఆయన కామెంట్స్ చేసారు. జగన్ ను రమ్మను రా జోగి పోటీకి ఇద్దరం కలిసి పోటి చేస్తాం అన్నారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: