రాష్ట్రంలో జగన్ పాలన గురించి గానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు పనితీరు పట్ల పలు రకాల చర్చలు నడుస్తున్నాయి గానీ, ఎంపీల గురించి పెద్దగా చర్చలు అయితే జరగడం లేదు. అసలు ఎంపీలు రాజకీయంగా పెద్దగా హైలైట్ కూడా కావడం లేదు. ఏదో ఇద్దరు, ముగ్గురు తప్ప మిగిలిన ఎంపీలు పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. అటు టి‌డి‌పిలో ఉన్న ముగ్గురు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రామ్మోహన్ నాయుడులు ఏదొక సందర్భంలో హైలైట్ అవుతూనే ఉన్నారు. అటు ఢిల్లీ స్థాయిలో కావొచ్చు...ఇటు రాష్ట్ర స్థాయిలో కావొచ్చు...కాస్త ప్రజలకు కనబడుతున్నారు.

కానీ వైసీపీ ఎంపీలే ఎక్కడ కూడా పెద్దగా హైలైట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. పార్లమెంట్‌లో ఎలాగో రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దగా పోరాటాలు చేసిన సందర్భాలు కనిపించలేదు. ఇటు రాష్ట్రంలో కూడా ఎంపీ ఫండ్స్‌తో ఇదిగో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని కూడా చెప్పడం లేదు. మెజారిటీ ఎంపీలు ఇదే వరుసలో ఉన్నారు. పేరుకు 22 మంది ఎంపీలు ఉన్నారు....కానీ వీరి వల్ల రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం కనిపించడం లేదు.

22 మందిలో చాలామంది ఎంపీలు గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదని తెలుస్తోంది. అలాంటి ఎంపీలని నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ సైడ్ చేస్తే బెటర్ అని, లేదంటే పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 22 మందిలో 8 మంది ఎంపీలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ 8 మందితో పాటు మరికొందరు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.

బెల్లాన చంద్రశేఖర్, బీశెట్టి సత్యవతి, ఎం‌వి‌వి సత్యనారాయణ, వంగా గీత, మార్గాని భరత్, చింతా అనురాధా, బాలశౌరి, నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, సంజీవ్ కుమార్‌లు ప్రజా వ్యతిరేకతని ఎదురుకునే ఎంపీల లిస్ట్‌లో ఉన్నారని తెలుస్తోంది. మరి వీరిపై జగన్ స్పెషల్ ఫోకస్ చేసి బలోపేతం చేయాల్సిన అవసరముంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: