ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రత్యక్షం గానో లేదా పరోక్షంగానో మొన్న ఏపీలో జరిగిన దాడులే దీనికి కారణం. అయితే రాష్ట్రం ఈ రోజు ఉత్కంఠ పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణం క్షణికావేశం అని చెప్పాలి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పట్టాభి ప్రభుత్వం మరియు సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల వలన ఇంత ఘోరం జరిగింది. అయినా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఈ విధంగా సీఎం హోదా కలిగిన వ్యక్తిని "బోసిడీకే" అని మాట్లాడడం సముచితం కాదు. ఈ ఒక్క మాటే రాష్ట్రంలో చిచ్చు రేపుతోంది. ఈ మాట ఒక్క సారి కాదు... పట్టాభి మాట్లాడిన 3 నిముషాలలో 10 సార్లు ఈ మాట అనడం ఎంతో దురదృష్టం.

అయితే పట్టాభి కనుక ఎప్పటి లాగే సంయమనంతో స్ట్రెయిట్ గా పాయింట్ మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదు. ఇక్కడ ఎవ్వరైనా సమస్యను వదిలేసి డైరెక్ట్ గా మాటల దాడి ఒక వ్యక్తిపై చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది అంతా ఆలోచించుకోవాలి.  ఈ వ్యాఖ్యలు చేసే ముందు తమ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కు చెప్పారా? చంద్రబాబు తెలిసే ఊరికే ఉన్నారా?  అనేది వారికే తెలియాలి. అయితే ఈ మాటలు విన్న చూసిన వైసిపి అభిమానులు, జగన్ అభిమానులు తట్టుకోలేక ఇలా టీడీపీ కార్యాలయాల పైన దాడులు చేశారని అంతా అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో ఇంకా తెలియలేదు. సీఎం జగన్ సైతం ఈ విషయంపై అభిమానుల స్పందన అని మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదంతా వచ్చే ఎన్నికల్లో ఎవరిమీద ప్రభావం చూపిస్తుంది అనే విషయం మరిచినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ విధమైన దాడులు సమర్ధించదగినవి కావు. జగన్ ప్రభుత్వం దృష్టి మారుతున్నట్లు అనిపిస్తోంది. ప్రజలపై మరియు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఇలాగే కొనసాగితే సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ ఇవన్నీ ఆలోచించి రానున్న రోజుల్లో అభివృద్ధి కోసం పాటుపడతారా  అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: