ఎప్పుడైతే ప్రతిపక్షానికి పరిమితమయ్యారో అప్పటినుంచి చంద్రబాబు...సీఎం జగన్‌ని టార్గెట్ చేసి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అసలు వెంటనే జగన్‌ని అధికారంలో నుంచి దించేసి...తాను అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడకక్కడ జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ, జగన్‌ని నెగిటివ్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు. కానీ దరిద్రం ఏంటంటే...ఎప్పుడైతే జగన్‌ని కాస్త నెగిటివ్ చేస్తున్నారనే సమయంలోనే ఎన్నికల ఫలితాలు రాజకీయాన్ని మార్చేస్తున్నాయి.

మొదట పంచాయితీ ఎన్నికలు....జగన్‌కు మంచి బలాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ని ఇచ్చాయి...అలాగే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాలు జగన్‌కు బాగా బూస్ట్‌నిచ్చాయి. కానీ వెంటవెంటనే చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ పడిపోతూ వచ్చింది.

అయితే తాజాగా వెలువడిన బద్వేలు ఉపఎన్నిక ఫలితం సైతం వైసీపీకి బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య టీడీపీ-వైసీపీల మధ్య ఎలాంటి రచ్చ జరుగుతుందో తెలిసిందే. అలాగే వైసీపీ శ్రేణులు...టీడీపీ ఆఫీసులపై దాడులు చేయడంపై చంద్రబాబు ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బద్వేలు ఉపఎన్నిక ఫలితం వైసీపీకి బాగా కలిసొచ్చింది. బద్వేలులో వైసీపీ 90,550 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచింది. కానీ ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోయినా పరోక్షంగా నష్టపోయింది. ఎందుకంటే ఆ పార్టీ...బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది. అందుకే గత ఎన్నికల్లో కనీసం వెయ్యి ఓట్లు తెచ్చుకోలేని బీజేపీ ఇప్పుడు 21 వేల పైనే ఓట్లు తెచ్చుకుంది. అంటే టీడీపీ సపోర్ట్ ఉంది కాబట్టే ఆ ఓట్లు వచ్చాయని చెప్పొచ్చు.

అంటే పరోక్షంగా ఇక్కడ టీడీపీకి నష్టం జరిగితే...ప్రత్యక్షంగా బీజేపీకి లాభం జరిగింది. అసలు 21 వేల ఓట్లు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అటు కాంగ్రెస్‌కు కూడా 6 వేల పైనే ఓట్లు వచ్చాయి. కాబట్టి నెగిటివ్ అవుతుందనుకునే ప్రతిసారి వైసీపీకి ఎన్నికలు బాగా కలిసొస్తున్నాయి. ఏదేమైనా బాబు బ్యాడ్ లక్ అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: