నేటి రోజుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా ఇక వాట్సాప్ ద్వారానే పంపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎవరినైనా కలవాలి అన్న వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కలుసుకుంటున్నారు అని చెప్పాలి. అయితే నేటి రోజుల్లో అటు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నో సరికొత్త ఫీచర్లతో తమ వినియోగదారుల సంఖ్య పెంచుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే తమ వినియోగదారుల అందరికీ కూడా మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది వాట్సాప్. ఇటీవలే వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో ఉంచుకొని మెసేజ్ డిలీట్ ఫర్ ఎవరీ వన్ అనే ఆప్షన్ను తీసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం గంట సమయంపాటు మాత్రమే మెసేజ్ డిలీట్ ఫర్ ఎవరీ వన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఇక సమయం దాటిపోయిన తర్వాత ఆ మెసేజ్ ని ఎవరికీ కనిపించకుండా డిలీట్ చేసే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం మెసేజ్ డిలీట్ ఫర్ ఎవరీ వన్ టైం లిమిట్ పెంచింది వాట్సాప్. ఈ క్రమంలోనే మెసేజ్ పంపిన నెల రోజుల తర్వాత కూడా అవతలి వ్యక్తి చాట్ పేజీ నుంచి మెసేజ్ డిలీట్ చేసే అవకాశం అందుబాటులోకి రానుంది. ఇది ట్రయల్స్ దశలో ఉండగా త్వరలో యూజర్స్ కి అందుబాటులోకి రాబోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి