ఆంధ్రప్రదేశ్ లో కొత్త పార్టీ పాలన లోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే అందరి మనసులో యువ సీఎంగా ఎన్నికయిన జగన్ పాలన ఏ విధంగా ఉంది అనే విషయం ఇప్పుడు అందరూ హైలైట్ గా చర్చించుకుంటున్నారు.  ప్రజల్లో రెండు రకాల అభిప్రాయాలు ప్రభుత్వంపై కలుగుతున్నాయి. కొన్ని వర్గాల ప్రజలు నవరత్నాలు రూపంలో అద్భుతమైన పధకాలు తెచ్చి మాకు చాలా మంచి చేశాడు అని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి, విద్యా దీవెన, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్, మద్యపాన నిషేధం వంటి పధకాలు ప్రజలను ఎంతగానో ఆకర్శించాయి అని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఇంకా కొన్ని వర్గాలు జగన్ పాలనపై దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్ పాలనా తుగ్లక్ పాలనలా ఉందని ధ్వజమెత్తిన నాయకులను మనము చూశాము. సంక్షేమం పరంగా బాగుంది. కానీ రాష్ట్రము నుండి విడి పోయిన రాష్ట్రానికి తగిన విధంగా అభివృద్ధి జరగలేదని విమర్శిస్తున్నారు. అంతే కాకుండా నిరుద్యోగానికి సంబంధించి జగన్ ఒక్క గ్రామ వార్డ్ సచివాలయం లో ఇచ్చిన ఉద్యోగాలు మినహా పెద్దగా చేసింది ఏమీ లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పాలనలో జగన్ తీవ్రంగా విఫలం అయ్యాడని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా ఎదురు దాడి చేస్తున్నాయి.

పై విషయాలను తీక్షణంగా పరిశీలించిన తర్వాత జగన్ పాలనలో ఎవరికి లాభం జరిగింది అనేది ప్రజల నిర్ణయానికి వదిలేస్తున్నాము. అయితే మొత్తంగా చూసుకుంటే జగన్ పాలనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మరి ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎన్నికల్లో వ్యతిరేకత ఉంటుందా? అన్న విషయాలు తెలియాలంటే ఇంకా రెండున్నరేళ్ల కాలం పడుతుంది. మరో వైపు జగన్ పాలనపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ పార్టీ వాడుకోవడంలో ఎటువంటి ప్రణాళికలు అమలు చేయనుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: